WI vs AUS: రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం.. వరుసగా రెండవసారి ఖంగుతిన్న ఆస్ట్రేలియా టీం!
వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న పొట్టి క్రికెట్ సిరీస్‌లో రెండవసారి కూడా పరాజయం పాలైంది.
WI vs AUS: వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న పొట్టి క్రికెట్ సిరీస్‌లో రెండవ టీ20లో కూడా పరాజయం పాలైంది. తొలిమ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించిన వెస్టిండీస్ టీం.. తాజాగా రెండో వన్డేలోనూ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యం సంపాధించింది. మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. రెండవ ట20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 4 వికెట్లు కొల్పోయి 196 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ (9) నిరాశ పరచగా, మరో ఓపెనర్ సిమ్మన్స్ 21 బంతుల్లో 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 3 సిక్సులు, ఫోర్ ఉన్నాయి. మూడో బ్యాట్స్‌మెన్‌గా రంగంలోకి దిగిన క్రిస్‌గేల్ (13) అంచానాలను అందుకోలేకపోయాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో హిట్‌మేయర్ 36 బంతుల్లో 61 పరుగులతో ధాటిగా ఆడాడు. ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. మరో బ్యాట్స్‌మెన్ డ్వేన్ బ్రావో 34 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అలాగే రసెల్ కేవంల 8 బంతుల్లో 24 పరుగులు చేయడంతో ఆసీస్ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో హజల్‌వుడ్, అగర్, మార్ష్ లు తలో వికెట్ పడగొట్టారు.
198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో కేవలం 140 పరుగులకే చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మిచెల్ మార్ష్ ఒక్కడే (42 బంతుల్లో 54 పరుగులు; 5×4, 1×6) ఆకట్టుకున్నాడు. 8మంది బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం గమనార్హం. వెస్టిండీస్ బౌలర్లలో హెడన్ వాల్ష్ 3 వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను ఘోరంగా దెబ్బతీశారు. ఈ మ్యాచ్‌లో హిట్‌మేయర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. మూడవ టీ20 జులై 12న జరగనుంది.
Also Read:
ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!