RCB vs SRH IPL 2022 Match Prediction: అగ్రస్థానంపై బెంగళూరు కన్ను.. సన్‌రైజర్స్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధం..

Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Match Preview: IPL 2022 లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి

RCB vs SRH IPL 2022 Match Prediction: అగ్రస్థానంపై బెంగళూరు కన్ను.. సన్‌రైజర్స్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధం..
Rcb Vs Srh
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2022 | 8:09 AM

Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Match Preview: IPL 2022 లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. ఇక 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బెంగళూరు సన్‌రైజర్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లాలని భావిస్తోంది. రెండు జట్లూ మంచి రిథమ్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌ (RCB vs SRH) ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

సుందర్‌ రీ ఎంట్రీ..

ఇరు జట్లు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో నేటి మ్యాచ్‌లో పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చు. అయితే గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగుఎట్టే అవకాశం ఉంది. అయితే సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జగదీషా సుచిత్ కూడా రాణించడంతో తుదిజట్టులో కొనసాగే అవకాశం ఉంది. దీంతో శశాంక్‌ సింగ్ పెవిలియన్‌కు పరిమితం కావొచ్చు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ , అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మర్కరమ్‌ నిలకడగా పరుగులు సాధిస్తుండడంతో ఆజట్టు మంచి జోష్‌లో ఉంది. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, మార్కో జాన్సెన్‌లతో బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది.

కోహ్లీపైనే అందరి దృష్టి..

ఇక బెంగళూరు విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్ స్వేచ్ఛగా పరుగులు సాధించలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో 96 పరుగులతో రాణించిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ తన దూకుడును కొనసాగించాల్సి ఉంటుంది. ఇక దినేశ్‌ కార్తీక్ లీగ్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా నిలకడగా రాణిస్తుండడం ఆర్సీబీకి సానుకూలాంశం. ఇక జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగాలతో బౌలింగ్‌ విభాగం కూడా స్ట్రాంగ్‌గానే ఉంది.

హైదరాబాద్‌ దే పైచేయి..

కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 19 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 8, హైదరాబాద్ 11 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించాయి. గత సీజన్‌లోనూ చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి.

ఇరు జట్ల ప్లేయింగ్ – XI ఎలా ఉండొచ్చంటే..

బెంగళూరు:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

హైదరాబాద్ :

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐదాన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్/శశాంక్ సింగ్, జగదీషా సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జేన్సన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

టీవీ9లో నిరంతరం అప్‌డేట్స్‌..

ఆర్‌సీబీ, హైదరాబాద్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్ర్కిప్షన్‌తో వీక్షించొచ్చు. వీటితో పాటు https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

Also Read:KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిమాణం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!