IND vs NZ, 1st T20 Match Prediction: రోహిత్, ద్రవిడ్‌లకు ‘తొలి’ పరీక్ష.. టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా?
Today Match Prediction of India vs New Zealand: ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 17 మ్యాచులో న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. 9 మ్యాచుల్లో న్యూజిలాండ్ విజయం సాధించగా, 6 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది.
India vs New Zealand, 1st T20 Match Prediction, Fantasy XI Tips & Probable XI : టీ20 ప్రపంచకప్ సందడి ముగిసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వర్సెస్ భారత్‌లు తమ ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు నుంచి అంటే నవంబర్ 17 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అదే సమయంలో నవంబర్ 25 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్ జట్టు బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. అదే సమయంలో, రాహుల్ ద్రవిడ్ తొలిసారిగా టీమిండియాకు కోచ్‌గా కనిపించనున్నాడు. అదే సమయంలో, ఈ సిరీస్‌లో భారత టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, జడేజాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన మూడు రోజుల తర్వాత, న్యూజిలాండ్ భారత్‌తో ప్రారంభ టీ20ఐ ఆడనుంది. గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువగా జట్లు ఆటగాళ్ల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం, పనిభారాన్ని తగ్గించేందుకు ఆలోచిస్తున్నాయి. బబుల్ లైఫ్, క్వారంటైన్ ఆటగాళ్లను దెబ్బతీస్తున్నాయని టిమ్ సౌథీ అంగీకరించాడు. అయితే భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆట సందర్భంగా ఇప్పటికే ఆటగాళ్లకు విరామాలను ప్లాన్ చేయడానికి మేనేజ్‌మెంట్ మార్గాలను పరిశీలిస్తోందని నొక్కి చెప్పాడు.
ముఖ్యంగా ఈ సిరీస్‌కి సంబంధించిన షెడ్యూల్ న్యూజిలాండ్‌కు చాలా కఠినంగా ఉంటుంది. టెస్టు సిరీస్‌కు ముందు ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడతారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆటగాళ్లు పరాజయం పాలైన తరువాత దాదాపు రాత్రి 11 గంటల వరకు వేదిక వద్దనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం షార్జా మీదుగా జైపూర్‌కు ప్రయాణించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022కి(ICC T20 World Cup 2022) వెళ్లే మార్గం ఇప్పుడు ప్రారంభమవుతుంది.
న్యూజిలాండ్ ప్రపంచ టోర్నమెంట్‌లో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత్ మాత్రం గ్రూప్ దశ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కొత్త టీ20ఐ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌కు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యేందుకు కూడా ప్లాన్స్ వేస్తున్నాడు.
ఎప్పుడు: భారత్ vs న్యూజిలాండ్, తొలి టీ20ఐ (India vs New Zealand 1st T20I), నవంబర్ 17, రాత్రి 7 గంటలకు మొదలు
ఎక్కడ: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
పిచ్: ఈ వేదిక ఎప్పుడూ టీ20ఐకి ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ స్టేడియంలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగింది. ఇందులో రోహిత్, విరాట్ కోహ్లి దెబ్బకు ఆస్ట్రేలియా బెదిరిపోయింది. స్ట్రోక్ మేకింగ్ సులభంగా ఉండేలా బ్యాటర్లు నిజమైన వికెట్‌ను ఆశించవచ్చు. ఐపీఎల్ 2019లో వేదికపై జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఛేజింగ్‌లో విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ ఛేజింగ్ ఆశించే అవకాశాలు ఉన్నాయి.
హెడ్ టూ హెడ్: ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 17 మ్యాచులు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. 9 మ్యాచుల్లో న్యూజిలాండ్ విజయం సాధించగా, 6 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
భారత్: గాయపడిన/అందుబాటులో లేని ఆటగాళ్లు: ఈ సిరీస్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్ 2021లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు తొలిసారి అవకాశం కల్పించారు.
వ్యూహాలు: టీ20 ప్రపంచ కప్ నుంచి భారతదేశం నిష్క్రమణతో కాస్త ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో టీమిండియా బ్యాటింగ్ యూనిట్ ప్రత్యర్థుల స్పిన్ ముప్పును ఎదుర్కోకవడంలో విఫలమైంది. రెండు గేమ్‌లలో, స్పిన్నర్లతో తలపడిన 14 ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు 69 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయారు. న్యూజిలాండ్ వారి లైనప్‌లో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలతో మరోసారి యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు.
ప్లేయింగ్ XI అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్/హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్/మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్: గాయపడిన/అందుబాటులో లేని ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్ టీ20ఐ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధతపై దృష్టి పెట్టనున్నాడు. టిమ్ సౌథీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన లాకీ ఫెర్గూసన్ కోలుకుని సెలక్షన్‌కి అందుబాటులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు.
వ్యూహాలు: ఫైనల్‌కు దారితీసిన రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఎడమచేతి వాటం ఆటగాళ్లు – ఆఫ్ఘనిస్తాన్ తరపున నజీబుల్లా జద్రాన్, ఇంగ్లండ్ తరపున డేవిడ్ మలన్, మోయిన్ అలీ ఉనికిని బట్టి సాంట్నర్‌లపై దాడి చేశారు. టోర్నమెంట్‌లో సాంట్నర్, సోధి ఇద్దరూ ఎడమచేతి వాటం ఆటగాళ్లతో పోరాడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశారు. స్పిన్నర్ల ప్రభావానికి భారత్ అడ్డుకట్ట వేయాలంటే కిషన్, పంత్ పాత్ర చాలా కీలకం కానుంది.
ప్లేయింగ్ XI అంచనా: డారిల్ మిచెల్, మార్టిన్ గప్టిల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్ (కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే/కైల్ జామీసన్, టిమ్ సౌతీ (కెప్టెన్), ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.
స్క్వాడ్‌లు: భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ , వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్
న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ(కెప్టెన్), లాకీ ఫెర్గూసన్, కైల్ జామీసన్, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి, టాడ్ ఆస్టిల్, ఆడమ్ మిల్నే