AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బస్ డ్రైవర్‎ను కౌగిలించుకున్న ట్రెంట్ బౌల్ట్.. వైరల్‎గా మారిన వీడియో..

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. కివీస్ జట్టు ప్రయాణించిన బస్ డ్రైవర్‎ సంతోష్‎ను బౌల్ట్ కౌగిలించుకున్నాడు. సెల్ఫీలు దిగాడు...

Viral Video: బస్ డ్రైవర్‎ను కౌగిలించుకున్న ట్రెంట్ బౌల్ట్.. వైరల్‎గా మారిన వీడియో..
Boult
Srinivas Chekkilla
|

Updated on: Nov 17, 2021 | 7:32 AM

Share

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. కివీస్ జట్టు ప్రయాణించిన బస్ డ్రైవర్‎ సంతోష్‎ను బౌల్ట్ కౌగిలించుకున్నాడు. సెల్ఫీలు దిగాడు. ఈ వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్‎లో పోస్టు చేసింది. “మా బస్ డ్రైవర్ సంతోష్ కౌగిలింతతో టీ20 వరల్డ్ కప్‌ను ముగించాను. నెక్స్ట్ స్టాప్ జైపూర్!” అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియాలో మీడియాలో వైరల్ అవుతోంది. నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.

రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. నవంబర్ 25 న కాన్పూర్‌లో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతను తిరిగి జట్టులో చేరతాడు. ఈ టీ20 సిరీస్‎కు టీమ్ సౌథీ కివీస్‎కు కెప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నారు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇండియా వచ్చింది. వారికి ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా పోయింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇటు కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఇతర సీనియర్ ఆటగాళ్లతో పాటు టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ ఆడనుంది.

Read Also.. రాహుల్ ద్రావిడ్‌ పదవీ కాలం రెండేళ్లు..! అయితే శిష్యుడి విజయంపై గురువు నమ్మకంగా ఉన్నాడు..