IND vs NZ 1st T20: విలియమ్సన్ స్థానంలో బరిలోకి హాంకాంగ్ తుఫాను బ్యాట్స్‌మెన్.. 15 ఏళ్లకే ప్రపంచ కప్ ఆడిన అతనెవరంటే?

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ (IND vs NZ 1st T20) జరగనుంది. కేన్ విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

IND vs NZ 1st T20: విలియమ్సన్ స్థానంలో బరిలోకి హాంకాంగ్ తుఫాను బ్యాట్స్‌మెన్.. 15 ఏళ్లకే ప్రపంచ కప్ ఆడిన అతనెవరంటే?
Kane Williamson
Follow us

|

Updated on: Nov 16, 2021 | 10:11 PM

IND vs NZ 1st T20: భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి జైపూర్ వేదికగా టీ20 సిరీస్ (IND vs NZ 1st T20) ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్‌ జట్టు తాజాగా భారత్‌కు చేరుకుంది. టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా కివీ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు భారత్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన కివీస్ జట్టు భారీ మార్పులతో రంగంలోకి దిగనుంది. కేన్ విలియమ్సన్ టెస్ట్ సిరీస్‌కు తనను తాను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నందున టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. కివీస్ టీ20 టీమ్‌కి టిమ్ సౌథీకి కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో ఏ ప్లేయింగ్ XI న్యూజిలాండ్‌తో ల్యాండ్ అవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.

మీడియా నివేదికల ప్రకారం, న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ XIలో కేన్ విలియమ్సన్‌కు బదులుగా మార్క్ చాప్‌మన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. మార్క్ చాప్‌మన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, అతను హాంకాంగ్ తరపున క్రికెట్ కూడా ఆడాడు. చాప్‌మన్ హాంకాంగ్‌లో జన్మించాడు. అతని తల్లి అక్కడ నివాసముండేది. చాప్‌మన్ తండ్రి న్యూజిలాండ్ పౌరుడు. చాప్‌మన్ ఆక్లాండ్‌లో ఇంజనీరింగ్ చదివాడు. చాప్‌మన్ హాంకాంగ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే చాప్‌మన్ సెంచరీ సాధించాడు. చాప్‌మన్ కేవలం 15 ఏళ్ల వయసులో హాంకాంగ్ తరఫున అండర్-19 ప్రపంచ కప్ ఆడాడు. దీని తరువాత, చాప్‌మన్ న్యూజిలాండ్‌లో దేశీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశాన్ని పొందాడు. జైపూర్ టీ20లో విలియమ్సన్ స్థానంలో చాప్‌మన్‌కు అవకాశం కల్పించవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఇది కాకుండా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మిగిలిన ఆటగాళ్లు భారత్‌పై బరిలోకి దిగనున్నారు. అంటే మార్టిన్ గప్టిల్, డారెల్ మిచెల్ ఓపెనింగ్‌లో కనిపిస్తారు. మిడిల్ ఆర్డర్‌లో టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ ఆడటం కనిపిస్తుంది. బౌలింగ్‌లోనూ ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోవచ్చు.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI అంచనా – మార్టిన్ గప్టిల్, డారెల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే.

భారత్ ప్లేయింగ్ XI అంచనా- రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్ మరియు మహ్మద్ సిరాజ్.

Also Read: India Vs New Zealand: ఆ‍యన కెప్టెన్సీలోనే అరంగేట్రం చేశా.. మరోసారి ఆయన అండతోనే సారథ్యం చేస్తున్నా: రోహిత్ శర్మ

27 పరుగులకే జట్టంతా ఆలౌట్.. ఏడుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు.. ఎక్కడ జరిగిందో తెలుసా?