27 పరుగులకే జట్టంతా ఆలౌట్.. ఏడుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు.. ఎక్కడ జరిగిందో తెలుసా?

కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కకావికలం చేసి తన జట్టును విజేతగా నిలపడంలో కెప్టెన్‌గా అతిపెద్ద పాత్ర పోషించింది.

27 పరుగులకే జట్టంతా ఆలౌట్.. ఏడుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు.. ఎక్కడ జరిగిందో తెలుసా?
Qatar Women Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 9:28 PM

Qatar Women Cricket Team: ఒక ఓవ‌ర్‌లో 20-30 ప‌రుగులు వ‌చ్చే టీ20 క్రికెట్‌లో జ‌స్ట్ 27 ప‌రుగుల‌కే ఓ జట్టు ఔట‌వ‌డం షాకింగ్‌గా ఉంటుంది. కానీ, క్రికెట్ ఆటలో మాత్రం ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియదు. అడిలైడ్ టెస్టులో భారత క్రికెట్ జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌటైన సంగతి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ల బలం ఎంతైనా సరే, కేవలం 10 బంతుల్లోనే మొత్తం జట్టును కుప్పకూల్చవచ్చు. అయితే, అదే పిచ్‌పై జట్టు 150 పరుగులు చేయడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటిది దోహాలో కనిపించింది. నేపాల్, ఖతార్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ఉంది. నేపాల్ మ్యాచ్‌లో 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఖతార్‌లో పర్యటించిన నేపాల్ మహిళల జట్టు నవంబర్ 16 మంగళవారం ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడింది. రెండు జట్లూ క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్రను వేయాలనుకున్నాయి. తమకున్న అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని నేపాల్ జట్టు ఖతార్ ఆటగాళ్లకు క్రికెట్ పాఠాలు నేర్పింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇందులో బర్మా జట్టు తరఫున అత్యధికంగా 55 పరుగులు (47 బంతుల్లో) చేసింది. ఆమెకు తోడు ఓపెనర్ సీతా రాణా 33 బంతుల్లో 39 పరుగులు జోడించింది.

7 గురు ఆటగాళ్లు ‘జీరో’.. అనంతరం ఖతార్ అనుభవం లేని ఆటగాళ్ల పరిస్థితి మొదటి ఓవర్‌లోనే మరింత దిగజారింది. ఇన్నింగ్స్ రెండో, మూడో బంతికే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. కేవలం 14 పరుగులకే 6 వికెట్లు పడగా, అందులో నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేని పరిస్థితి నెలకొంది. దీని తర్వాత ఏడో వికెట్‌కు 12 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఖతార్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. స్కోరు 26 పరుగుల వద్ద ఏడో వికెట్ పడగా, మిగిలిన 3 వికెట్లు కూడా 1 పరుగు వ్యవధిలో పడిపోయాయి. జట్టు మొత్తం 27 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ 119 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఖతార్ బ్యాటింగ్‌లో 7 గురు ఆటగాళ్లు జీరోకే పెవిలియన్ చేరారు. ఖాదీజా ఇంతియాజ్, ఏంజెలిన్ మేయర్ జట్టులో అత్యధికంగా 8 పరుగులు చేశారు. అదే సమయంలో నేపాల్‌ తరఫున కెప్టెన్‌ రుబీనా ఛెత్రీ కేవలం 11 బంతుల్లోనే 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.

Also Read: IND vs NZ 1st T20: ఆ ప్లేయర్‌ను ఆల్‌రౌండర్‌గా మార్చేందుకు హెడ్‌ కోచ్‌ ద్రవిడ్ స్కెచ్.. స్పెషల్ చిట్కాలతో నెట్స్‌లో ప్రాక్టీస్

శవాలీలో పరుగుల యంత్రం.. ఐపీఎల్‌లోనూ తుఫాన్ ఇన్నింగ్సులు ఆడిన ఆటగాడు.. కోచ్ ద్రవిడ్ అయినా ఛాన్స్ ఇచ్చేనా?