దేశవాలీలో పరుగుల యంత్రం.. ఐపీఎల్‌లోనూ తుఫాన్ ఇన్నింగ్సులు ఆడిన ఆటగాడు.. కోచ్ ద్రవిడ్ అయినా ఛాన్స్ ఇచ్చేనా?
Syed Mushtaq Ali T20 Trophy: గత ఆరు ఇన్నింగ్స్‌లలో మూడింటిలో ఈ ఆటగాడు హాఫ్ సెంచరీలు సాధించాడు. మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 150పైగానే ఉంది.
Sanju Samson: వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ దేశవాళీ క్రికెట్‌లో సందడి చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో కేరళకు కెప్టెన్‌గా ఉండగా, అద్భుతమైన బ్యాటింగ్‌తో తన జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునేలా చేశాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో శాంసన్ 39 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా ఆడాడు. దీంతో 146 పరుగుల లక్ష్యాన్ని కేరళ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి ఛేదించింది. అతడితో పాటు మహ్మద్ అజారుద్దీన్ 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు ఓపెనర్ రాఘవ్ ధావన్ 65 పరుగులతో హిమాచల్ ప్రదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కానీ లక్ష్యం ముందు కేరళను అతని బౌలర్లు ఆపలేకపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్‌లో రాఘవ్ ధావన్ (65), ప్రశాంత్ చోప్రా (36) మాత్రమే భారీ పరుగులు చేయగలిగారు. వీరే కాకుండా మిగతా బ్యాట్స్‌మెన్ కేరళ బౌలింగ్ ముందు డీలాపడ్డారు. అంకుష్ బెయిన్స్ (0), నిఖిల్ గంగ్తా (1), రిషి ధావన్ (1) వంటి బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన కేరళ తరఫున సుధీసన్ మిధున్ అత్యంత విజయవంతమయ్యాడు. కేరళ లక్ష్యాన్ని ధీటుగా ఛేదించింది. రోహన్ కున్నుమ్మల్ 16 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.
అనంతరం మహ్మద్ అజారుద్దీన్ (60), సంజు శాంసన్ (52) రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో జట్టు లక్ష్యానికి చేరువైంది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అలరించిన ఇన్నింగ్స్ ఆడి అజారుద్దీన్ ఔటయ్యాడు. చివర్లో సచిన్ బేబీ 10, శాంసన్ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అద్భుతమైన ఫామ్‌లో శాంసన్ .. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంజూ శాంసన్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడాడు. 113.50 సగటుతో 227 పరుగులు చేశాడు. నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 143.67గా ఉంది. శాంసన్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ టోర్నీలో అతని స్కోర్లు 52 నాటౌట్, 56 నాటౌట్, 14, 6, 45 నాటౌట్, 54 నాటౌట్. సంజూ శాంసన్ ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా బాగానే ఆడాడు. రాజస్థాన్ తరఫున అతను 14 మ్యాచ్‌ల్లో 40.33 సగటుతో 484 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు వచ్చాయి.
సంజూ శాంసన్ ఇటీవలి ప్రదర్శన తర్వాత, అతన్ని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ మళ్లీ పెరిగింది. ఇప్పటివరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఈ కారణంగానే శాంసన్‌కు అవకాశం దక్కలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: India Vs New Zealand 2021: ఇక నుంచి విరాట్ కోహ్లీ స్థానం అదే: తేల్చి చెప్పిన భారత టీ20 సారథి