India Vs New Zealand: ఆ‍యన కెప్టెన్సీలోనే అరంగేట్రం చేశా.. మరోసారి ఆయన అండతోనే సారథ్యం చేస్తున్నా: రోహిత్ శర్మ

IND vs NZ 1st T20: రోహిత్ శర్మ 2007 సంవత్సరంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు.

India Vs New Zealand: ఆ‍యన కెప్టెన్సీలోనే అరంగేట్రం చేశా.. మరోసారి ఆయన అండతోనే సారథ్యం చేస్తున్నా: రోహిత్ శర్మ
Ind Vs Nz 1st T20 Rahul Dravid And Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 10:12 PM

Rahul Dravid-Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2021లో వైఫల్యం తర్వాత, ప్రస్తుతం టీమ్ ఇండియా కొత్త ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా టీ20 టీమ్‌కి కూడా కొత్త ఆరంభం ఉంది. రోహిత్ శర్మ తొలిసారి టీ20 టీమ్‌కి ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నాయకత్వం వహించనున్నాడు. అదే సమయంలో, రాహుల్ ద్రవిడ్ ఫుల్ టైమ్ హెడ్ కోచ్‌గా అరంగేట్రం చేసే మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ ప్రారంభానికి ముందు, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఒకరితో ఒకరు కలిసిన మొదటి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.

రోహిత్ శర్మ 2007 సంవత్సరంలో టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, మరిన్ని కొత్త భాగస్వామ్యాలు మరిన్ని ఆహ్లాదకరమైన జ్ఞాపకాలకు దారితీస్తాయని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌తో తొలి వన్డే ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ తన సత్తా చాటాడు. అదే సమయంలో, గొప్ప ఆటగాడు అయిన ద్రవిడ్, కోచ్‌గా భారత క్రికెట్‌లో సరికొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధం చేయడంలో ఫెసిలిటేటర్ పాత్ర పోషించాడు. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు జరిగిన తొలి సమావేశాన్ని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు.

బస్సులో మొదటిసారి కలిసిన ద్రవిడ్-రోహిత్.. ద్రవిడ్ మాట్లాడుతూ, ‘మేం సోమవారం బస్సులో దీని గురించి మాట్లాడుతున్నాం. సమయం ఎలా మారిపోయింది. మద్రాసులో ఛాలెంజర్‌గా ఆడకముందే రోహిత్ నాకు తెలుసు. రోహిత్ స్పెష‌ల్ అని మాకందరికీ తెలుసు. అతను అసాధారణ ప్రతిభావంతుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. భారత జట్టుతో పాటు ముంబై ఇండియన్స్‌తో ఇన్నేళ్లలో అతను సాధించిన ఘనత అభినందనీయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ కెప్టెన్సీలో నెరవేరిన రోహిత్ కల.. రోహిత్ మాట్లాడుతూ, ‘2007లో నేను ఎంపికైనప్పుడు, బెంగళూరులోని క్యాంపులో ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా తక్కువగా మాట్లాడాం. నేను చాలా భయపడ్డాను. నేను నా వయస్సు వారితో అంతగా మాట్లాడలేను. ఆ తరువాత ద్రవిడ్ మాట్లాడుతూ, ‘ఐర్లాండ్‌లో మొదటిసారి, నేను ఆ మ్యాచ్ ఆడుతున్నట్లు నాతో చెప్పాడు. దాంతో నా కల నిజమైంది. అప్పటి నుంచి చాలా జరిగాయి. అవన్నీ మంచి జ్ఞాపకాలు. భవిష్యత్తులో మరిన్ని ఉంటాయని ఆశిస్తున్నాను’ అని రోహిత్ అన్నాడు.

Also Read: 27 పరుగులకే జట్టంతా ఆలౌట్.. ఏడుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు.. ఎక్కడ జరిగిందో తెలుసా?

IND vs NZ 1st T20: ఆ ప్లేయర్‌ను ఆల్‌రౌండర్‌గా మార్చేందుకు హెడ్‌ కోచ్‌ ద్రవిడ్ స్కెచ్.. స్పెషల్ చిట్కాలతో నెట్స్‌లో ప్రాక్టీస్