Ind vs Nz: ఆటగాళ్లు యంత్రాలు కాదు.. విశ్రాంతి అవసరం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత టీ20 సారథి రోహిత్ శర్మ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లు "యంత్రాలు కాదు" విశ్రాంతి అవసరమని అన్నారు. ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత హోమ్ టూర్లో న్యూజిలాండ్‌తో సిరిస్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు...
భారత టీ20 సారథి రోహిత్ శర్మ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లు “యంత్రాలు కాదు” విశ్రాంతి అవసరమని అన్నారు. ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత హోమ్ టూర్లో న్యూజిలాండ్‌తో సిరిస్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ కూడా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ ఆడింది. రెండు రోజుల గ్యాబ్ తర్వాత టీ20 మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 25 నుంచి టెస్ట్ సిరీస్ కూడా పాల్గొననుంది.
“వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ మాకు చాలా ముఖ్యం. ఆటగాళ్లు యంత్రాలు కాదు. సమయం తీసుకోవడం అవసరం” అని రోహిత్ శర్మ వర్చువల్ విలేకరుల సమావేశంలో భారత కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి అన్నారు. “చాలా కాలంగా ఆడుతున్న కొంతమంది ఆటగాళ్లు తాజాగా ఉండటానికి విశ్రాంతి తీసుకోవాలి. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు మా అబ్బాయిలందరూ మానసికంగా తాజాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము” అని చెప్పాడు. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా షార్ట్-ఫార్మాట్ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు కానీ కాన్పూర్ టెస్ట్ వరకు తిరిగి జట్టులోకి రానున్నాడు.
క్రికెటర్లు తమ పనిభారాన్ని నిర్వహించే విషయంలో ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ బ్యాటింగ్ హీరో ద్రవిడ్ అన్నారు. “ఫుట్‌బాల్‌లో కూడా పెద్ద ఆటగాళ్లు అన్ని మ్యాచ్‌లు ఆడరు. ఆటగాడి మానసిక, శారీరక శ్రేయస్సు చాలా ముఖ్యమైనది” అని అతను చెప్పాడు.
Viral Video: బస్ డ్రైవర్‌ను కౌగిలించుకున్న ట్రెంట్ బౌల్ట్.. వైరల్‌గా మారిన వీడియో..