AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brad Hogg: డేవిడ్ వార్నర్ వచ్చే ఐపీఎల్‎లో ఆ జట్టుకు ఆడే ఆవకాశం ఉంది.. ఎందుకంటే..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఆ వెంటనే జరిగిన టీ20 వరల్డ్ కప్‎లో అద్భుతంగా ఆడాడు. ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

Brad Hogg: డేవిడ్ వార్నర్ వచ్చే ఐపీఎల్‎లో ఆ జట్టుకు ఆడే ఆవకాశం ఉంది.. ఎందుకంటే..
Warner
Srinivas Chekkilla
|

Updated on: Nov 17, 2021 | 8:23 AM

Share

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఆ వెంటనే జరిగిన టీ20 వరల్డ్ కప్‎లో అద్భుతంగా ఆడాడు. ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. డేవిడ్ వార్నర్‎కు వచ్చే ఏడాది మెగా ఐపీఎల్ వేలంలో డిమాండ్ ఉంటుందని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అంచనా వేశారు. వార్నర్‎ను రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు సొంతం చేసుకున్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పాడు. ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడని హగ్‌ పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021 ఫైనల్లో డేవిడ్ వార్నర్ 53 పరుగులు చేశాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి కప్ గెలుచుకున్నారు.

“అతన్ని ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) దక్కించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే బెంగళూరుకు అతనికి సెట్ అవుతారు. ఆ జట్టుకు ఒక నాయకుడు కావాలి. RCB వారి ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను అతని కెప్టెన్సీ రికార్డుతో చేర్చవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లి నాయకత్వ బాధ్యతలను వదులుకున్నాడు” అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. “IPL 2021 ముగిసిన తర్వాత, వార్నర్ వివిధ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో విడిపోవడాన్ని గుర్తు చేశాడు. ‘వచ్చే ఐపీఎల్‌లో వార్నర్‌ సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడకపోవచ్చు. యాజమాన్యంతో అతడికి విభేదాలు వచ్చినట్లున్నాయి. అందుకే, వేలంలో అతడిని సొంతం చేసుకునేందుకు పలు ప్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అని చెప్పాడు.

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అతను ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఓవర్సీస్ బ్యాటర్స్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్‌లలో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో 35 ఏళ్ల అతను 7 మ్యాచ్‌లలో 48.17 సగటుతో 289 పరుగులు చేశాడు.

Read Also.. Ind vs Nz: ఆటగాళ్లు యంత్రాలు కాదు.. విశ్రాంతి అవసరం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..