Virat Kohli: విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్లపై ఆరోపణలు.. వారిని రానివ్వటం లేదంటా.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ One8 కమ్యూన్ స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యులను రానివ్వడం లేదని వస్తున్న ఆరోపణలను ఖండించింది. రెస్టారెంట్ యాజమాన్యం స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యుల ప్రవేశంపై వివక్ష చూపుతోందని 'యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా' గ్రూప్‌ సభ్యులు ఆరోపించారు...

Virat Kohli: విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్లపై ఆరోపణలు.. వారిని రానివ్వటం లేదంటా.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..
Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 17, 2021 | 8:52 AM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ One8 కమ్యూన్ స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యులను రానివ్వడం లేదని వస్తున్న ఆరోపణలను ఖండించింది. రెస్టారెంట్ యాజమాన్యం స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యుల ప్రవేశంపై వివక్ష చూపుతోందని ‘యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా’ గ్రూప్‌ సభ్యులు ఆరోపించారు. పుణెలోని వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్ అవుట్‌లోకి స్త్రీ-పురుష, సాధారణ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారని విమర్శించారు. రెస్టారెంట్‌కు సంబంధించిన ఇతర శాఖల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలను ఖండించిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఎలాంటి లింగబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపింది. ‘మా రెస్టారెంట్ నిబంధనలనుబట్టి మేం మొదట్నుంచి అందరికి మా సేవలను అందిస్తున్నాం. ఎల్లప్పుడూ కలుపుకొని వెళ్తున్నాం’ అని పేర్కొంది. ఒక ప్రకటనలో, One8 కమ్యూన్ వారి లింగం లేదా ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా అందరినీ స్వాగతిస్తున్నట్లు తెలిపింది.

“మా పేరు సూచించినట్లుగా, మేము మా ప్రారంభం నుండి అన్ని సంఘాలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ కలుపుకొని ఉన్నాము” అని అది పేర్కొంది. రెస్టారెంట్ నియమాలు పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయని నొక్కిచెప్పింది. కంపెనీ తన విధానాల గురించి ఏదైనా “అనుకోకుండా తప్పు జరిగితే” యాజమాన్యాన్ని సంప్రదించాలని ప్రజలను కోరింది. LGBTQIA+ గ్రూప్‌ అడిగిన ప్రశ్నకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమాధానం ఇచ్చింది. ట్రాన్స్‌జండర్‌ మహిళలను వారి దుస్తులను బట్టి అనుమతినిస్తామని పేర్కొంది. అందుకోసమే తమ పాలసీల గురించి ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని, తమమీద తప్పుడు ముద్ర వేయకూడదని కోరుతున్నట్లు తెలిపింది.

Read Also.. Viral Video: బస్ డ్రైవర్‎ను కౌగిలించుకున్న ట్రెంట్ బౌల్ట్.. వైరల్‎గా మారిన వీడియో..

Ind vs Nz: ఆటగాళ్లు యంత్రాలు కాదు.. విశ్రాంతి అవసరం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

Brad Hogg: డేవిడ్ వార్నర్ వచ్చే ఐపీఎల్‎లో ఆ జట్టుకు ఆడే ఆవకాశం ఉంది.. ఎందుకంటే..