AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs SA: ఆతిథ్య దేశానికి బిగ్ షాక్.. సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఉత్కంఠ పోరులో ఓడిన విండీస్..

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ 2024లో భాగంగా 10వ సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ దక్షిణాఫ్రికాకు 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మూడు ఓవర్లను కుదించారు. అనంతరం దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. దీంతో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

WI vs SA: ఆతిథ్య దేశానికి బిగ్ షాక్.. సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఉత్కంఠ పోరులో ఓడిన విండీస్..
Sa Vs Wi
Venkata Chari
|

Updated on: Jun 24, 2024 | 10:51 AM

Share

West Indies vs South Africa, 50th Match, Super 8 Group 2: ఐసీసీ టీ-20 ప్రపంచకప్ 2024లో భాగంగా 10వ సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ దక్షిణాఫ్రికాకు 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మూడు ఓవర్లను కుదించారు. అనంతరం దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. దీంతో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వెస్టిండీస్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా సూపర్ ఎయిట్ గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 3 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా మూడు గెలిచి 6 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

ఆదివారం, ఇంగ్లండ్ సూపర్ 8 గ్రూప్ 2 మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను 10 వికెట్ల తేడాతో ఓడించి T20 ప్రపంచ కప్ 2024 సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది.

WI vs SA సూపర్ 8 మ్యాచ్ తర్వాత అప్‌డేట్ చేసిన పాయింట్ల పట్టిక..

జట్టు ఆడింది గెలిచింది ఓడింది పాయింట్లు నెట్ రన్ రేట్
1. దక్షిణాఫ్రికా 3 3 0 6 +0.599
2. ఇంగ్లాండ్ 3 2 1 4 +1.992
3. వెస్టిండీస్ 3 1 2 2 +0.963
4. అమెరికా 3 0 3 0 -3.905

రెండు జట్ల ప్లేయింగ్-11..

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్త్యా, తబ్రైజ్ షమ్సీ.

వెస్టిండీస్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోతీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..