- Telugu News Sports News Cricket news Chris Jordan Becomes First England Bowler To Bag Hat Trick Against West Indies in T20 World Cup 2024
నువ్వేంది భయ్యా, ఇంత డేంజరస్‌గా ఉన్నావ్.. హ్యాట్రిక్‌తోపాటు ఒకే ఓవర్లో 4 వికెట్లు.. ప్రపంచ రికార్డ్ బౌలింగ్
Chris Jordan: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 115 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో ఇంగ్లిష్ 10 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
Updated on: Jun 24, 2024 | 10:05 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 49వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. అమెరికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టును 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలీకృతులయ్యారు. తద్వారా అమెరికా జట్టు స్వల్ప మొత్తానికి అవుట్ కావడంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ లో 19వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్ తొలి బంతికే కోరీ అండర్సన్ వికెట్ తీశాడు. మూడో బంతికే అలీఖాన్ వికెట్ తీశాడు. నాలుగో బంతికి నుష్టుష్ కెంజిగే, ఐదో బంతికి సౌరభ్ నేత్రవాల్కర్‌ను కూడా అవుట్ చేశాడు.

దీంతో క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా కూడా నిలిచాడు. దీంతోపాటు టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

దీనికి ముందు, 2021 T20 ప్రపంచ కప్‌లో, ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ క్రిస్ జోర్డాన్ కూడా ఈ ఘనత సాధించాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన 2వ బౌలర్‌గా నిలిచాడు.




