IND vs WI: 100వ మ్యాచ్‌లో సెంచరీ ఇన్నింగ్స్.. లిస్టులో దిగ్గజ బ్యాటర్స్..
షాయ్ హోప్ తన 100వ వన్డేలో 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. దీంతో ఈ స్పెషల్ లిస్టులో 10వ బ్యాటర్ గా నిలిచాడు.
IND vs WI 2022: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా షాయ్ హోప్ 135 బంతుల్లో 115 పరుగుల ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. షాయ్ హోప్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదేశాడు. వాస్తవానికి ఇది షాయ్ హోప్‌కి 100వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ తన 100వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన 10వ బ్యాట్స్‌మెన్‌గా షాయ్ హోప్ నిలిచాడు. అయితే, రెండో వన్డేలో టీమిండియా 312 పరుగుల క్లిష్ట లక్ష్యాన్ని చేధించి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో సిరీస్ ను గెలుచుకుంది.
ఈ స్పెషల్ జాబితాలో ఎవరున్నారో తెలుసా..
వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ మొదట ఈ ఘనత సాధించాడు. గోర్డాన్ గ్రీనిడ్జ్ తన 100వ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీంతో పాటు క్రిస్ గేల్, మహ్మద్ యూసుఫ్ కూడా ఈ ఘనత సాధించారు. అదే సమయంలో, ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మార్కస్ ట్రెస్కోథిక్, రామ్ నరేష్ సర్వాన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఈ విధంగా 100వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన 10వ బ్యాట్స్‌మెన్‌గా షాయ్ హోప్ నిలిచాడు.
షాయ్ హోప్ సెంచరీ..
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. వెస్టిండీస్ తరపున షాయ్ హోప్ 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు చేశాడు. షమ్రా బ్రూక్ 35 పరుగులు చేయగా, కైల్ మేయర్స్ 39 పరుగులు చేశాడు. భారత్ తరపున శార్దూల్ ఠాకూర్ అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ 7 ఓవర్లలో 54 పరుగుల వద్ద ముగ్గురు ఆటగాళ్లను అవుట్ చేశాడు.