కోహ్లీ సేనతో పోరాడాలంటే ఎంతో శ్రమించాలి.. భారత్ పర్యటన గురించి ఇంగ్లాండ్ సారథి ఏం చెబుతున్నాడో తెలుసా..

స్వదేశంలో భారత్‌తో తలపడాలంటే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాలని చెబుతున్నాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్. శ్రీలంకతో రెండో టెస్టుకు

  • uppula Raju
  • Publish Date - 8:24 am, Fri, 22 January 21
కోహ్లీ సేనతో పోరాడాలంటే ఎంతో శ్రమించాలి.. భారత్ పర్యటన గురించి ఇంగ్లాండ్ సారథి ఏం చెబుతున్నాడో తెలుసా..

స్వదేశంలో భారత్‌తో తలపడాలంటే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాలని చెబుతున్నాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు రూట్‌ ఇండియా టూర్ గురించి మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాలో టీం ఇండియా గొప్పగా పోరాడిందన్నారు. ఘోర ఓటమి నుంచి పుంజుకుని జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించారని కొనియాడారు.

టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తున్న అభిమానులకు ఈ సిరీస్‌ గొప్ప ప్రచారం తీసుకొచ్చిందన్నారు. మాతో సిరీసుకు టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంటుందని అనుకుంటున్నానని చెప్పారు. సొంతగడ్డపై విజయాలు ఎలా సాధించాలో టీం ఇండియాకు బాగా తెలుసన్నారు. కోహ్లీసేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలని తెలిపారు. గెలవాలనే ఉద్దేశంతో మేం వస్తున్నాం. ఇందుకోసం మేమెంతో శ్రమించాలని తెలుసని రూట్‌ పేర్కొన్నాడు. భారత్‌లో సిరీసుకు బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ రావడం జట్టులో జోష్‌ నింపుతుందని వెల్లడించాడు. ఏదేమైనా భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌ అద్భుతంగా ఉండనుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుందన్న సంగతి తెలిసిందే.

భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది…సుమారు 4 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇంగ్లాండ్