AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli- Anushka: ‘జూనియర్ కోహ్లీ’ రికార్డుల వేట మొదలెట్టాడు.. పాకిస్తాన్‌లోనూ ఫ్యాన్స్ సంబరాలు.. వీడియో

జూనియర్ కోహ్లీగా నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న అకాయ్‌ అప్పుడే ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. తనకు కొడుకు పుట్టాడంటూ విరాట్ కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ గంటలోనే ఐదు మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్ట్ గా కోహ్లీ పోస్ట్ రికార్డు సృష్టించింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు

Virat Kohli- Anushka: 'జూనియర్ కోహ్లీ' రికార్డుల వేట మొదలెట్టాడు.. పాకిస్తాన్‌లోనూ ఫ్యాన్స్ సంబరాలు.. వీడియో
Virat Kohli, Anushka
Basha Shek
|

Updated on: Feb 21, 2024 | 1:16 PM

Share

టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క దంపతులు మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బ్రవరి 15న అనుష్క శర్మ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు కోహ్లీ. ‘మా హృదయాలు గొప్ప ఆనందం, ప్రేమతో నిండి ఉన్నాయి. ఫిబ్రవరి 15న మేము మా అబ్బాయి, అలాగే వామికా తమ్ముడు అకాయ్‌ని మా జీవితంలోకి స్వాగతించాం’ అని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కోహ్లీ- అనుష్క దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులైతే జూనియర్ కోహ్లీ వచ్చేశాడంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ కోహ్లీగా నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న అకాయ్‌ అప్పుడే ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. తనకు కొడుకు పుట్టాడంటూ విరాట్ కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ గంటలోనే ఐదు మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్ట్ గా కోహ్లీ పోస్ట్ రికార్డు సృష్టించింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. జూనియర్ కోహ్లీ అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేశాడంటూ క్రేజీ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక అకాయ్ పోస్ట్‌కు ఇప్పటివరకు సుమారు 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ రెండో సారి తండ్రి అయ్యాడని తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅతని అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇక దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఉన్న విరాట్​ అభిమానులు కొందరు మిఠాయిలు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషం.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ లోనూ సంబరాలు.. వీడియో..

నెట్టింట ట్రెండ్ అవుతోన్న జూనియర్ కోహ్లీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..