Virat Kohli: అనుకున్నదంతా అయ్యింది.. కేవలం 7 పరుగుల దూరం.. కోహ్లీ ఫ్యాన్స్ గుండె బద్దలు.!

గత కొంతకాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్...

Virat Kohli: అనుకున్నదంతా అయ్యింది.. కేవలం 7 పరుగుల దూరం.. కోహ్లీ ఫ్యాన్స్ గుండె బద్దలు.!
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2022 | 10:12 AM

గత కొంతకాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్ ఎప్పటికైనా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని.. 71వ సెంచరీ పూర్తి చేస్తాడని రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. వరుసగా తక్కువ స్కోర్లకే కోహ్లీ పెవిలియన్ చేరుతుండటంతో.. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ యావరేజ్‌పై ప్రభావం పడింది. ఇంతకాలం అన్ని ఫార్మాట్లలోనూ తమ క్రికెటర్‌దే 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉందని చెప్పుకునే విరాట్ కోహ్లీ అభిమానుల గుండె బద్దలయ్యింది. కేవలం 7 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటును దిగజార్చుకున్నాడు.

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ వరుసగా 23, 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీనితో ఐదేళ్ల తర్వాత తొలిసారి అతని బ్యాటింగ్ యావరేజ్ 50 దిగువకు పడిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 43 పరుగులు(రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి) చేసి ఉంటే అతని సగటు 50కి పైనే ఉండేది. ఒకప్పుడు 55 కంటే ఎక్కువ సగటు సాధించిన కోహ్లీ ఐదేళ్ల తర్వాత తొలిసారి 50కి దిగువకు పడిపోయాడు.

అంతకుముందు 2017 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55కి దిగజారగా.. ఇప్పుడు అదే టీంతో జరిగిన మ్యాచ్‌లో అదే సీన్ రిపీట్(49.95) కావడం గమనార్హం. కాగా, కోహ్లీ ప్రస్తుతం101 టెస్ట్‌ల్లో 49.55, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. శ్రీలంక గెలవాలంటే మరో 419 పరుగులు కావాలి.. ఇండియా గెలుపుకు 9 వికెట్లు అవసరం.