IND vs SL, 2nd Test, Day 3 Highlights: డే అండ్ నైట్ టెస్ట్ టీమిండియా సొంతం.. లంకకు మరోసారి నిరాశే మిగిల్చిన రోహిత్ సేన..
IND vs SL, 2nd Test, Day 3 Highlights: బెంగుళూరు టెస్ట్ మూడో రోజున, భారత్ 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 238 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యం ఉండగా, టీమిండియా కేవలం 208 పరుగులకే కట్టడి చేసి ఘన విజయం సాధించింది. భారత విజయంలో ఆర్ అశ్విన్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. ఇక తొలి ఇన్నింగ్స్ ఆట చూస్తే.. టీమిండియా బౌలర్ల ధాటికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఐదు వికెట్లు తీస్తే.. అశ్విన్, షమీ చెరి రెండు వికెట్లు, అక్షర్ ఓ వికెట్ పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. రోహిత్ 46 రన్స్‌చేసి హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. మయాంక్ 22, విహారి 35 పరుగులు చేశారు. ఇక కోహ్లీ మరోసారి నిరాశపరచాడు. కేవలం13 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
అయితే రిషభ్ పంత్, అయ్యర్ మరోసారి మెరిశారు. అర్ధసెంచరీలు చేసి టీమిండియాకు మెరుగైన స్కోరు అందించారు. ముఖ్యంగా కేవలం 28 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పంత్.. టెస్టుల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో త్రుటిలో కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ (67) రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరిద్దరి చలవతో రెండో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 303/ 9 వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక మళ్లీ తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ తిరిమానే వికెట్‌ను కోల్పోయింది. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన లంకేయులు గెలవాలంటే ఇంకా 419 రన్స్ చేయాల్సి ఉంది. అయితే టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే ఈ టార్గెట్‌ను ఛేదించడం అసాధ్యమే.
రెండు జట్లు-
భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.
Key Events
భారత్ 303 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు సాధించారు. పంత్ ధాటిగా కపిల్ రికార్డు బద్దలైంది.
LIVE Cricket Score & Updates
-
టీమిండియా ఘన విజయం.. టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన
బెంగళూరు వేదికగా జరిగిన డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. మూడో రోజు 208 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియా శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక..
కరుణరత్నే(107) రూపంలో శ్రీలంక టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో భారత విజయానికి మరో 3 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం లంక టీం 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇంకా 242 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
-
-
సెంచరీ పూర్తి చేసిన కరుణరత్నే..
శ్రీలంకను గట్టేక్కించేందుకు కరుణరత్నే తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సెంచరీ తో కదం తొక్కాడు. 168 బంతుల్లో 107 పరుగులు చేసి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో లంక టీం 200 పరుగులకు చేర్చాడు. లంక విజయం సాధించాలంటే ఇంకా 247 పరుగుల చేయాల్సి ఉంది. భారత్‌కు మాత్రం మరో 4 వికెట్లు కావాల్సి ఉంది.
-
ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక..
శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 89, లసిత్ ఎంబుల్దేనియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కరుణరత్నే టెస్టుల్లో 28వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంకా 262 పరుగుల దూరంలో నిలిచింది. భారత్ మాత్రం మరో 4 వికెట్లు పడగొడితే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయనుంది.
-
మాథ్యూస్ ఔట్..
21వ ఓవర్ నాలుగో బంతికి ఏంజెలో మాథ్యూస్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. జడేజా వేసిన బంతికి మాథ్యూస్ తడబడ్డాడు. దీంతో 98 పరుగుల వద్ద శ్రీలంక టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం లంక టీం 3 వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది. ఇంకా 345 పరుగుల వెనుకంజలోనే నిలిచింది. భారత్ విజయానికి మరో 7 వికెట్లు కావాల్సి ఉంది.
-
-
కెప్టెన్ రోహిత్ తొలి టెస్టు సిరీస్ విజయం?
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ తన తొలి టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. మొహాలీలో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అతను తన కెప్టెన్సీలో జట్టును విజయపథంలో నడిపించాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా టెస్ట్ కెప్టెన్సీని గొప్పగా ప్రారంభించాలనుకుంటున్నాడు.
-
లంక బ్యాటర్లు ఆగేనా..
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా టీమిండియా మరో అడుగేసింది. లంక ముందు భారీ టార్గెట్ ఉండడంతోపాటు.. పిచ్ క్రమంగా బౌలర్లకు అనుకూలిస్తుండడంతో మూడోరోజే మ్యాచ్ ముగిసిపోవచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు
Published On - Mar 14,2022 2:06 PM