Ranji Trophy: 37 ఫోర్లు, 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ.. 17 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వీరవిహారం.. బౌలర్ల ఊచకోత!

డొమెస్టిక్ లెవెల్‌లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో..

Ranji Trophy: 37 ఫోర్లు, 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ.. 17 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వీరవిహారం.. బౌలర్ల ఊచకోత!
Cricket
Follow us

|

Updated on: Mar 14, 2022 | 2:08 PM

డొమెస్టిక్ లెవెల్‌లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో 17 ఏళ్ల యువ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతడికి విరాట్ సింగ్ అనే ప్లేయర్ సహాయమందిచడంతో వీరిద్దరూ కలిసి 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఝార్ఖండ్‌కు చెందిన ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ప్రీ-క్వార్టర్స్‌లో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు.

శనివారం ఝార్ఖండ్, నాగాలాండ్ మధ్య ప్రీ-క్వార్టర్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ మొదలు కాగా.. ఇందులో నాగాలాండ్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్‌కు దిగిన ఝార్ఖండ్ 880 పరుగులకు ఆలౌట్ అయింది. కుమార్ సూరజ్(66), రాహుల్ శుక్లా(85), అనుకుల్ రాయ్(59) అర్ధ సెంచరీలతో ఆదరగొట్టగా.. 155 బంతుల్లో 107 పరుగులతో విరాట్ సింగ్ దుమ్ముదులిపాడు. ఇక 17 ఏళ్ల కుమార్ కుశాగ్రా( 266) డబుల్ సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇదే మొదటి మూడు అంకెల స్కోరు కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ మూడో రోజుకు చేరుకుంది.