Virat Kohli: గదిలో అనుష్క ముందు ఏడ్చేసిన కోహ్లీ.. బాలీవుడ్ నటుడి కీలక వ్యాఖ్యలు..
Virat Kohli seen crying in front of Anushka Sharma: విరాట్ కోహ్లికి సంబంధించి ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతున్న కోహ్లి.. పేలవ ఫాంతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో గదిలో అనుష్క ముందు కోహ్లి ఏడ్వడంపై బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli: ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాతో ఉన్నాడు. అతని భార్య అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లి గురించి ఓ పెద్ద షాకింగ్ విషయం బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ గదిలో అనుష్క శర్మ ముందు ఏడుస్తున్నాడంట. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వెల్లడించాడు. అనుష్క సన్నిహితులలో వరుణ్ ధావన్ కూడా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అనుష్క విరాట్ గురించిన విషయాలను వరుణ్ ధావన్‌తో పంచుకుంది. ఇదే విషయాన్ని ఆయన వివరించారు.
ప్రముఖ యూట్యూబ్ షో టీఆర్‌ఎస్‌లో వరుణ్ ధావన్ పేర్కొన్న సంఘటనకు ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనకు ఎలాంటి సంబంధం లేదు. వరుణ్ చెప్పిన కథ ఇంగ్లండ్‌లో ఆడిన నాటింగ్‌హామ్ టెస్టులో భారత్ ఓడిపోయిన సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు విరాట్ ఫామ్ సరిగా లేదని బాలీవుడ్ నటుడు చెప్పాడు. అనుష్క తన ఆలోచనలను నాతో ప్రస్తావించింది.
‘ది రణవీర్ షో’ అనే యూట్యూబ్ ప్రోగ్రామ్‌లో మాట్లడిని ఆయన.. విరాట్‌తో అనుష్క కనిపించలేదు. ఎక్కడ వెదికినా విరాట్ ఎక్కడున్నాడో తెలియలేదు. చివరికి అనుష్క గదిలోనే విరాట్‌ని కనుగొంది. విరాట్ ఎమోషన్స్ తర్వగా కంట్రోల్ చేసుకోలేడు. అనుష్క ముందు ఏడ్చాడు. విరాట్ విఫలమయ్యాడని కాదు, ఆ రోజు మైదానంలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి అతనే. కాకపోతే, మ్యాచ్ ఓడిపోవడం బాధగా అనిపించిందంట. ఈ విషయాలన్నీ అనుష్క స్వయంగా తనతో పంచుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పేలవ ఫాం సమయంలో వరుణ్ ధావన్‌తో అనుష్క పంచుకుంది. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండేవాడు. అయితే, ఇప్పుడు విరాట్ కెప్టెన్ కాదు. అతను ఆటగాడిగా మాత్రమే జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. ప్రస్తుత పర్యటనలో ఆస్ట్రేలియాతో ఆడిన తొలి 3 టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..