IPL 2022: అందుకే ఆ ప్లేయర్‌ను సారథిగా ఎంచుకున్నాం.. అలాంటి వారే మాకు కావాలి: ఆర్‌సీబీ మాజీ సారథి
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లి RCBలో భాగమయ్యాడు. 2013 నుంచి టీమ్‌కి పూర్తి సమయం కెప్టెన్‌గా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), జట్టు కొత్త నాయకుడు ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis)పై కీలక విషయాలు వెల్లడించాడు. ఫాఫ్ డు ప్లెసిస్ బలమైన నాయకత్వ నైపుణ్యాల కారణంగానే ఫ్రాంచైజీ అతనిని రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) కి కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లి RCBలో భాగమయ్యాడు. 2013 నుంచి టీమ్‌కి పూర్తి సమయం కెప్టెన్‌గా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. RCB ఇప్పుడు నాలుగు సార్లు IPL విజేత జట్టులో భాగమైన డు ప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నాడు. గత నెలలో జరిగిన మెగా వేలంలో ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు ఆయనను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
RCB ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, ‘వేలంలో ఫాఫ్‌ను ఎంపిక చేయడం, మా ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. మాకు ఎంతో గౌరవం ఉన్న కెప్టెన్ కావాలి. అతను టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను అత్యంత గౌరవనీయమైన క్రికెటర్’ అని పేర్కొన్నాడు. అతని నాయకత్వం పట్ల సంతోషిస్తున్నాం. తన పాత్రను చాలా చక్కగా పోషిస్తాడని ఆశిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
ఆటగాళ్లందరితో మంచి అనుబంధం..
డుప్లెసీతో మా అందరికీ మంచి అనుబంధం ఉందని కోహ్లీ చెప్పాడు. మాక్సీ (గ్లెన్ మాక్స్‌వెల్), దినేష్ కార్తీక్, ఇతర సహచరులందరూ అతని నాయకత్వంలో ఈ టోర్నమెంట్‌ను ఆస్వాదిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కోహ్లి సోమవారం RCB ప్రాక్టీస్ క్యాంపులో చేరాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం తన పనిభారాన్ని నిర్వహించాలని కోరుకోవడంతో RCB కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గతంలో చెప్పాడు. ‘ఐపీఎల్ ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసిందంటే నమ్మశక్యం కాదు. నేను అనేక బాధ్యతలు, విధుల నుంచి విముక్తి పొందాను. కాబట్టి నేను నూతన శక్తితో బరిలోకి దిగుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
సుదీర్ఘకాలంగా కెప్టెన్సీ అనుభవం..
ఫాఫ్ డు ప్లెసిస్‌కి కెప్టెన్సీ కొత్త విషయం కాదని తెలిసిందే. అతను కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా ఉన్నాడు. T20 క్రికెట్‌లో 60కి పైగా విజయాల శాతాన్ని కలిగి ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాన్ని రూపొందించడంలో ధోనీతో పాటు అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ధోనీ, డుప్లెసి ఎప్పుడూ గంటల తరబడి ఓ సమస్యను చర్చిస్తారని దీపక్ చాహర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. డు ప్లెసిస్ కెప్టెన్సీలోనే కాకుండా బ్యాట్‌తో కూడా అద్భుతాలు చేస్తాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ఈ బ్యాట్స్‌మెన్ 633 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచిన గైక్వాడ్ కంటే డు ప్లెసిస్ కేవలం 2 పరుగుల వెనుకంజలో ఉన్నాడు.
Also Read: Watch Video: ఇదేందిరా సామీ.. బౌలర్‌ను ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Rajasthan Royals IPL 2022: రెండవ ట్రోఫీ కోసం సిద్ధమైన శాంసన్ సేన.. బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?
IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?