అంత అప్యాయంగా కోహ్లీ హత్తుకున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఆటలోనే అగ్రెషన్.. బయట పసిపిల్లాడే!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కోహ్లీ శ్రేయస్ అయ్యర్ తండ్రిని ఆప్యాయంగా పలకరించి, ఆశీర్వదం తీసుకున్నాడు. కోహ్లీ ఆటలోనే అగ్రెసివ్ ఉండే కోహ్లీ, బయట ఎంతో వినయంగా ఉంటారని ఈ సంఘటన రుజువు చేసింది.

ఐపీఎల్ 2025 ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్లుగా కప్పు కోసం పోరాటం చేస్తున్న ఆర్సీబీ.. అంతిమంగా ఈ 18వ సీజన్‌లో తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం లాంఛనమైన తర్వాత విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ముగిశాక.. తీవ్ర భావోద్వేగ దృశ్యాలు చూశాం. అలాగే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రత్యేక అతిథిని కూడా విరాట్ కోహ్లీ ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. ఎంతో వినయంగా ఆ అతిథి ఒళ్లో తలపెట్టి ఆశీర్వదం కూడా తీసుకున్నాడు.
ఇంతకు ఆ ప్రత్యేక అతిథి ఎవరంటే.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తండ్రి. తన కుమారుడు లీడ్ చేస్తున్న టీమ్ ఐపీఎల్ ఫైనల్ ఆడుతుండటంతో ఆయన కూడా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చారు. ఫలితం పంజాబ్‌కు అనుకూలంగా రాకపోయినా.. పంజాబ్ ఆటగాళ్లు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఎంతో స్పోర్టివ్‌గా ఆర్సీబీ ప్లేయర్లను అభినందించారు. అలాగే శ్రేయస్ అయ్యర్ వాళ్ల నాన్న గ్రౌండ్‌లోకి వచ్చిన క్రమంలో కోహ్లీ వెళ్లి ఆయనను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నిజానికి విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ పర్సన్ అని, అతిగా ప్రవర్తిస్తుంటాడని చాలా మంది అతన్ని విమర్శిస్తుంటారు.
ఈ సీజన్‌లో కూడా పంజాబ్‌పై లీగ్ మ్యాచ్ గెలిచిన సమయంలో శ్రేయస్ అయ్యర్‌ను చూస్తూ.. ఓవర్ అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసుకున్నాడని, క్వాలిఫైయర్ 1లో పంజాబ్ యంగ్ బ్యాటర్, ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్‌ను వాటర్ బాయ్ అంటూ అవమానించాడంటూ కోహ్లీని చాలా మంది తిట్టారు.. కానీ, అక్కడ జరిగింది వేరు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. వన్స్ మ్యాచ్ అయితే పోతే పసిపిల్లాడే అయిపోతారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు, తోటి క్రికెటర్లతో తల్లిదండ్రులను ఎంతో ఆపాయ్యంగా పలకరిస్తాడు. మొన్నా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో షమీ తల్లి కాళ్లు మొక్కాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వాళ్ల నాన్నను ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నాడు. అది చూసి అయ్యర్ కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కోహ్లీ.. ఆటలో అగ్రెషన్ చూపిస్తాడు కానీ, బయటికి పిసిపిల్లాడే అనే విషయం మరోసారి రుజువైంది.
Virat Kohli hugging Shreyas Iyer’s father. 🥹❤️ pic.twitter.com/hvaOxkcmLw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
