AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారత్, లంక మ్యాచ్‌లో మజా ఇచ్చిన సీన్ ఇదే.. ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోన్న ‘రోహిరాట్’ వీడియో.. భావోద్వేగం పక్కా బ్రదర్

India vs Sri Lanka, Asia Cup 2023: శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు సంబరాలు చేసుకుంటూ చేసిన ఓ పని భారత క్రికెట్ అభిమానులకు 324 రోజుల నాటి కథను గుర్తు చేసింది. అంతేకాకుండా, ఇద్దరు ఆటగాళ్లు కూడా ఇలా చేయడం ద్వారా ఫ్యాన్స్‌కు మంచి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. భారత్-శ్రీలంకకు సంబంధించిన రోహిత్-విరాట్‌ల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Video: భారత్, లంక మ్యాచ్‌లో మజా ఇచ్చిన సీన్ ఇదే.. ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోన్న 'రోహిరాట్' వీడియో.. భావోద్వేగం పక్కా బ్రదర్
Virat Kohli Rohit Sharma
Venkata Chari
|

Updated on: Sep 13, 2023 | 3:42 PM

Share

Rohit Sharma – Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీమ్ ఇండియాలో ఇద్దరు సూపర్ స్టార్లు. క్రికెట్ ఫీల్డ్‌లో వీరి రికార్డులే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాయి. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రతీసారి.. ఏదో ఒక రూపంలో మేం ఒక్కటే అంటూ అభిమానులకు సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇదే సీన్ ఆసియా కప్‌లోనూ చోటు చేసుకుంది. అయితే, ఇది అభిమానులకు సంవత్సరం క్రితం నాటి ఓ సీన్‌ను గుర్తు చేయడం విశేషం. శ్రీలంకతో మ్యాచ్‌లో వీరిద్దరూ చేసిన ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ సీన్ ఇద్దరి అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. 324 రోజుల నాటి కథను మళ్లీ గుర్తు చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు రెండు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. మొట్టమొదట వారి మధ్య విభేదాలు లేవంటూ చాటిచెప్పారు. ఇక రెండవది, విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి నోరుమూయించారు.

ఈ మ్యాచ్ సమయంలో రోహిత్, విరాట్ ఓ వికెట్ పడిన సందర్భంలో చేసిన వేడుకల వీడియో ఆకట్టుకుంటోంది. శ్రీలంక ఇన్నింగ్స్ 26వ ఓవర్ జరుగుతోంది. ఆరో వికెట్‌గా శ్రీలంక కెప్టెన్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భావోద్వేగపు సీన్ చోటు చేసుకుంది.

రోహిత్, విరాట్ మధ్య ఏం జరిగింది?

26వ ఓవర్‌ను రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్నాడు. ఈ ఓవర్ తొలి బంతికే దసున్ షనక స్లిప్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. శ్రీలంక కెప్టెన్ ఇచ్చిన ఈ క్యాచ్‌ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతంగా పట్టుకున్నాడు. దీంతో రోహిత్ కాళ్లపై కూర్చుని గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఈ వికెట్ వేడుకలో విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఒక్కసారిగా రోహిత్‌ని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం ప్రపంచం చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

324 రోజుల క్రితం కూడా ఇలాంటిదే..

రోహిత్-విరాట్ కొలంబోలో 12 సెప్టెంబర్ 2023న ఎలా కనిపించారో.. 324 రోజుల క్రితం అంటే 23 అక్టోబర్ 2022న అదే విధంగా కనిపించారు. పాకిస్థాన్‌పై విజయం తర్వాత కనిపించిన సీన్.. ఇప్పుడు శ్రీలంకపై విజయం తర్వాత కనిపించిన సీన్‌లో కొద్దిగా తేడా ఉంది. అక్టోబర్ 2022 లో ఆడిన T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని తన చేతులతో పైకి ఎత్తుకున్నాడు. 2023 సెప్టెంబర్‌లో ఆసియా కప్‌లో శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత విరాట్ వచ్చి రోహిత్‌ను కౌగిలించుకున్నాడు. దీంతో ఫ్యా్న్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆసియా కప్‌లోనే అద్భుతమైన సీన్ అంటూ కొందరు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసే సీన్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

విమర్శకులకు సందేశం స్పష్టంగా ఉందంటోన్న ఫ్యాన్స్..

రెండు సీన్‌ల మధ్య 324 రోజుల తేడా ఉన్నప్పటికీ, సందేశం చాలా స్పష్టంగా ఉంది. టీమ్ ఇండియాలో అంతా బాగానే ఉంది. రోహిత్‌-విరాట్‌ల మధ్య బంధం ఏంటని ప్రశ్నించే వారికి ఈ రెండు సీన్‌లే సమాధానం అంటున్నారు ఫ్యాన్స్. ప్రేమకు బదులు ద్వేషాన్ని వ్యాపింపజేసే వారికి సందేశం కూడా పక్కాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..