Video: ఆ ఒక్క బంతిని ఆడేందుకు విరాట్ కోహ్లీ 7 ఆఫ్షన్స్ ఇచ్చాడు: టీమిండియా స్టార్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
R Ashwin: భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చాలా తెలివైన బౌలర్‌గానే కాదు.. అంతకుమించిన బ్యాటర్‌గానూ పేరుగాంచాడు. అతను తన వ్యూహాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటాడు. భారత్ తరపున 270 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే.
R Ashwin: భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చాలా తెలివైన బౌలర్‌గానే కాదు.. అంతకుమించిన బ్యాటర్‌గానూ పేరుగాంచాడు. అతను తన వ్యూహాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటాడు. భారత్ తరపున 270 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే బ్యాట్‌తోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే, తన కెరీర్‌లో ఓ కీలక మ్యాచ్ గురించి ఇటీవలే వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తానీ బౌలర్ నుంచి అది కూడా చివరి ఓవర్లో బ్యాటింగ్ చేయడంపై మాట్లాడాడు. దీని గురించి అతను ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆలోచిస్తాడంట.
ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడిన భారత స్పిన్ బౌలర్.. వేలాది మందితో నిండిన స్టేడియంలో బ్యాటింగ్ చేయడానికి బయటకు వచ్చిన క్షణం గురించి చెప్పుకొచ్చాడు. టీమిండియాను విజయం వైపు నడిపించాల్సిన ఒత్తిడి, అది కూడా పాకిస్తాన్‌పై అంటూ ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ ఘటన 2022 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించినది. చివరి బంతికి భారత్ విజయానికి రెండు పరుగులు అవసరం. కాగా, ఆర్ అశ్విన్ స్ట్రైక్‌లో ఉన్నాడు.
కార్తీక్ ఔట్ కావడంతో అశ్విన్ ఆగ్రహం..
అశ్విన్ మాట్లాడుతూ, ‘చివరి ఓవర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్ అవుట్ అయినప్పుడు, నేను అతనిపై చాలా కోపంగా ఉన్నాను. అతని వల్ల నేను చాలా కష్టమైన పని చేయాల్సి వచ్చింది. క్రీజులోకి వెళ్లాక.. ప్రేక్షకుల కేకలు విన్నాను. ఇదో పెద్ద అవకాశమని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు.
ఒక్క బంతిని ఆడేందుకు కోహ్లీ ఏడు ఆప్షన్లు ఇచ్చాడు..
View this post on Instagram
ఆ ఒక్క బంతిని ఆడేందుకు కోహ్లీ తనకు ఏడు ఆప్షన్లు ఇచ్చాడని అశ్విన్ తెలిపాడు. టెస్టుల్లో ఐదు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ నాకు ఆ ఒక్క బంతిని ఆడేందుకు ఏడు ఎంపికలు ఇచ్చాడు. నేను ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాను. కోహ్లీ కళ్లలో ఏతో పవర్ ఉంది. నవాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఈ అవకాశాన్ని వదిలేయాలని అనుకోలేదు. అది వైడ్‌గా వెళ్లింది. మ్యాచ్ గెలుస్తామని అప్పుడు అర్థమైందంటూ తెలిపాడు.
ప్రతి రాత్రి ఆ బంతిని గుర్తు చేసుకుంటా..
రోజూ నిద్రపోయే ముందు తాను వదిలిన ఆ ఒక్క బంతి గురించి ఆలోచిస్తానని, ఆ బంతి ప్యాడ్‌కు తగిలి ఉంటే ఏమై ఉండేదోనని భయమేసేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ తన చేతుల్లో ముగిసేలా రాసుకున్నట్లు భావించానని అన్నాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. క్యాలెండర్‌లో అభిమానులు అక్టోబర్ 15 తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆ రోజున భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా, మ్యాచ్ హై ఓల్టేజీగా మారుతుంది. ఈసారి కూడా అలాంటిదే జరుగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..