Rishabh Pant: డేట్ ఆఫ్ బర్త్ మార్చేసిన రిషబ్ పంత్.. ‘ఇది నా 2వ పుట్టినరోజు’ అంటూ ట్వీట్.. ఎందుకో తెలుసా?
Rishabh Pant Date of Birth: గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.
Rishabh Pant Date of Birth: టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో రిషబ్ పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ముంబైలోని కోకిల్ బెన్ ఆసుపత్రిలో పంత్‌కు శస్త్రచికిత్స జరిగింది. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పంత్.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన బయోని మార్చుకున్నాడు.
రికార్డుల ప్రకారం, పంత్ అక్టోబర్ 4, 1997 న జన్మించాడు. కానీ, ఇప్పుడు పంత్ తన సోషల్ మీడియా ఖాతాలో తన బయోని మార్చాడు. జనవరి 5, 2023న నా 2వ పుట్టినరోజు అంటూ రాసుకొచ్చాడు.
కాగా, డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదానికి గురై ముంబైలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగి రోజులు గడిచే కొద్దీ పంత్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అందువల్ల కారు ప్రమాదం తర్వాత తనకి పునర్జీవితంగా భావిస్తూ.. ఇలా మార్చేశాడని అంటున్నారు.
2022లో టీమిండియా తరపున మంచి ప్రదర్శన చేసిన పంత్.. టీమ్ ఇండియా తరపున 7 మ్యాచ్‌లు ఆడి 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..