AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: తెరపైకి విరాట్ కోహ్లీ ఓల్డ్ లవ్ స్టోరీ.. 12 ఏళ్ల తర్వాత కామెంట్ చేసిన మాజీ లవర్..!

Virat Kohli Ex Girlfriend Comment: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించినా, మైదానం వెలుపల సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే, ఈసారి విరాట్ చేసిన ఒక చిన్న పొరపాటు అతని పాత ప్రేమకథను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒక విదేశీ వ్లాగర్ ఫోటోను విరాట్ లైక్ చేయడం, ఆపై అతని మాజీ ప్రేమికురాలు ఘాటుగా స్పందించడం ఇప్పుడు క్రీడా లోకంలో సంచలనంగా మారింది.

Virat Kohli: తెరపైకి విరాట్ కోహ్లీ ఓల్డ్ లవ్ స్టోరీ.. 12 ఏళ్ల తర్వాత కామెంట్ చేసిన మాజీ లవర్..!
Virat Kohli Ex Girlfriend Tweet
Venkata Chari
|

Updated on: Apr 22, 2026 | 12:26 PM

Share

Virat Kohli Ex Girlfriend Comment: విరాట్ కోహ్లీ ఇటీవల జర్మనీకి చెందిన వ్లాగర్ లిజ్‌లాజ్ ఫోటోను లైక్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించడంతో, విరాట్ వెంటనే అన్‌లైక్ చేశాడు. అయితే, ఈ విషయం అక్కడితో ఆగకుండా మరింత వివాదాస్పదమైంది. గతంలో కూడా అవనీత్ కౌర్ ఫోటోను లైక్ చేసినప్పుడు, అది సాంకేతిక లోపం అని విరాట్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈసారి వివాదం మరో మలుపు తిరిగింది.

రంగంలోకి దిగిన మాజీ ప్రేమికురాలు..

ఈ వివాదం కొనసాగుతుండగానే, విరాట్ కోహ్లీ మాజీ ప్రేమికురాలు, బ్రెజిల్ నటి ఇజాబెల్ లైట్ అకస్మాత్తుగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇజాబెల్, అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్‌లాజ్ ఫోటోలను కలిపి ఒక కొలేజ్ పోస్ట్ చేశారు. దానికి “మైదానంలో ఉన్నా, బయట ఉన్నా విరాట్ ఎంపిక అద్భుతంగా ఉంటుంది” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఇజాబెల్ తీవ్ర అసహనానికి గురైంది.

12 ఏళ్లు దాటినా ఇంకా అదేనా?

Virat Kohli Ex Girlfriend

తన పేరును మళ్లీ వివాదంలోకి లాగడంపై ఇజాబెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సదరు పోస్ట్ కింద స్పందిస్తూ.. “ఆ విషయాలు జరిగి 12 ఏళ్లు దాటిపోయింది. కానీ ప్రజలు ఇంకా పాత విషయాలనే పట్టుకుని వేలాడుతున్నారు” అని కామెంట్ చేసింది. ప్రజలు ఇంకా ఎందుకు గతాన్ని వదిలి ముందుకు సాగలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇజాబెల్ ఇన్‌స్టా పోస్ట్..

గతం ఒక పాఠం.. వర్తమానం సంతోషం..

2014లో ఇజాబెల్ స్వయంగా విరాట్‌తో తనకున్న రెండేళ్ల బంధం గురించి బయటపెట్టింది. కానీ ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో కలిసి ఎంతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇజాబెల్ స్పందనను బట్టి చూస్తే, ఆమె తన గతాన్ని పూర్తిగా మర్చిపోయిందని, ప్రపంచం కూడా ఆ విషయాన్ని మర్చిపోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. విరాట్ వైపు నుంచి దీనిపై ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us