AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance: రిఫైనరీ నుంచి జియో విప్లవం వరకు.. రిలయన్స్ ప్రస్థానం అదరహో..

దేశ చరిత్రలో రిలయన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ చరిత్రలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాలు మార్చేలా చేసింది. ఇండియా అంటేనే రిలయన్స్ అనే స్థాయికి ఎదిగింది. జామ్ నగర్‌లో ఏర్పాటు చేసిన రిఫైనింగ్ కాంప్లెక్స్ నుంచి జియో వరకు రిలయన్స్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

Reliance: రిఫైనరీ నుంచి జియో విప్లవం వరకు.. రిలయన్స్ ప్రస్థానం అదరహో..
Mukesh Ambani
Venkatrao Lella
|

Updated on: Oct 15, 2026 | 1:40 PM

Share

దేశంలో రిలయన్స్ అనే పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. దశాబ్దాలుగా దేశ వ్యాపార చరిత్రలో ఓ వెలుగు వెలుగుతోంది. దేశ ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది. తమ వ్యాపారంతో దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పులకు కారణమైంది. ఒక చిన్న రూములో ప్రారంభమైన ఈ సంస్థ.. ఇప్పుడు అంతర్జాతీయంగా తమ శాఖలను విస్తరిస్తూ అనేక రంగాల్లో తమ సత్తా చాటుతోంది. ధీరూభాయ్ అంబానీ మొదలుపెట్టిన ఈ కంపెనీ.. ఇప్పుడు ముకేష్ అంబానీ నాయకత్వంతో మరింత విస్తరించింది. గుజరాత్‌లోని జామ్ నగర్‌ ప్రారంభమైన రిలయన్స్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు పొందింది. రిలయన్స్ ప్రస్థానంలో కీలక మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం.

దేశంలోనే అది పెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్

ధీరూభాయ్ అంబానీకి దేశంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్మించాలనే కల ఉండేది. ఆ కలను ముఖేష్ అంబానీ నెరవేర్చారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ నెలకొల్పారు. ఈ భారీ ప్రాజెక్టును కేవలం 36 నెలల్లో పూర్తి చేయగా.. రిలయన్స్ ప్రస్థానంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకునే సమయంలో ముఖేష్ అంబానీ తన చదువును మధ్యలేసి భారత్‌కు తిరిగొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించి దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిపారు. అత్యంత వేగంగా భారీ ప్రాజెక్టును పూర్తి చేసి దేశ చరిత్రలో తన సత్తాను నిరూపించుకున్నారు. ఇక జియోతో రిలయన్స్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. డిజిటల్ ఇండియా కలను నిజం చేస్తూ.. దేశ టెలికాం చరిత్రలో జియో పెను మార్పులు తీసుకొచ్చింది. ప్రతీ ఒక్కరికి సరసమైన ధరకు ఇంటర్నెట్ అందించి డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. 2016లో జియో సేవలు ప్రారంభమవ్వగా.. ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి చేసుకుంది.

జియోతో డిజిటల్ విప్లవం

ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరకు డేటా అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది జియో వినియోగదారులుగా మారారు. కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను జియో సంపాదించుకుని రికార్డ్ సృష్టించింది. దీనిని బట్టి చూస్తే ప్రతి సెకనుకు సుమారు ఏడుగురు కొత్తగా జియో నెట్‌వర్క్‌లో చేరినట్లు తెలుసుకోవచ్చు. జియో సేవలు కేవలం నగరాలకే పరిమితం కాలేదు. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గిరిజన గ్రామాలకు సైతం విస్తరించారు. దీని ద్వారా అత్యవసర వైద్య పరిస్థితుల్లో సహాయం పొందడం నుంచి విద్య, ఉపాధి, కుటుంబ సభ్యులతో అనుసంధానం కావడం వరకు డిజిటల్ కనెక్టివిటీ లభించింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలోనూ ఇంటి నుంచే విద్య, ఉద్యోగాలు, వైద్య సంప్రదింపులు కొనసాగించడంలో డిజిటల్ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషించాయి.

భారత్‌లో నిర్మాణం.. ప్రపంచంతో పోటీ

పారిశ్రామిక రంగం నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వ్యాపారాల వరకు రిలయన్స్ తన ప్రస్థానాన్ని విస్తరించింది. భారత్‌లోనే ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించాలనే లక్ష్యంతో పెట్టుబడులు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ ప్రయాణంలో దీర్ఘకాలిక దృష్టి, భారీ పెట్టుబడులు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కీలక పాత్ర పోషించాయి. ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ చేపట్టిన పారిశ్రామిక, డిజిటల్ విస్తరణ భారతదేశ ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సాగింది. ధీరూభాయ్ అంబానీ కలలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం.. ముఖేష్ అంబానీ నాయకత్వంలో కోట్లాది మంది భారతీయులకు చేరువైంది. భారీ రిఫైనరీల నుంచి ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ వరకు.. రిలయన్స్ వారసత్వం దేశ అభివృద్ధిలో పారిశ్రామిక ఆశయాలు, సాంకేతిక మార్పులు ఎలా కీలక పాత్ర పోషించగలవో చాటిచెబుతోంది.

Follow Us
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్
మనుషుల వేలిముద్రలతో దగ్గరి పోలిక ఉండే జంతువు ఏదో తెలుసా?
మనుషుల వేలిముద్రలతో దగ్గరి పోలిక ఉండే జంతువు ఏదో తెలుసా?
చిక్కుల్లో ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. భారత్‌ను వీడాలంటూ నోటీసులు..
చిక్కుల్లో ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. భారత్‌ను వీడాలంటూ నోటీసులు..