గీటు దాటావో… వేటు తప్పదు!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిషేధం ముంగిట ఉన్నాడు. ఇప్పటికే టోర్నీ లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో శనివారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. సెమీస్, ఫైనల్‌కి దూరమవుతాడు. వివరాల్లోకెళితే… మైదానంలో కాస్త‌ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లి.. ప్రపంచకప్‌లోనూ అదే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నాడు. ఈ […]

గీటు దాటావో... వేటు తప్పదు!
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 2:44 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిషేధం ముంగిట ఉన్నాడు. ఇప్పటికే టోర్నీ లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో శనివారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. సెమీస్, ఫైనల్‌కి దూరమవుతాడు.

వివరాల్లోకెళితే… మైదానంలో కాస్త‌ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లి.. ప్రపంచకప్‌లోనూ అదే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అప్పీల్‌ని తిరస్కరించడంతో సహనం కోల్పోయి అతని మీదకి దూసుకెళ్లాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చాడు. గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇలానే క్రమశిక్షణ తప్పి ఒక డీమెరిట్‌ పాయింట్‌ని పొందిన కోహ్లీ ఖాతాలో ఇప్పుడు మొత్తం రెండు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం.. రెండేళ్ల వ్యవధిలో ఒక క్రికెటర్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరితే.. వెంటనే నిషేధం అమలులోకి రానుంది. రెండు డీమెరిట్ పాయింట్లు ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లతో సమానం. దీంతో.. ఒకవేళ శ్రీలంకతో శనివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. అతని ఖాతాలో ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు చేరే అవకాశం ఉంది. దీంతో.. కోహ్లీ దూకుడుపై సెమీస్ ముంగిట టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ఆందోళన నెలకొంది.

Latest Articles
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్