నీ వాగుడు ఆపు… సంజయ్ మంజ్రేకర్‌పై జడేజా ఫైర్!

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాగా… ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో గాయపడిన‌ కేఎల్ రాహుల్ స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కొద్దిసేపటికే లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుకున్నాడు. దీంతో.. ఈ క్యాచ్‌ని జడేజా తప్ప టీమిండియా‌లో ఎవరూ పట్టలేరంటూ ఇంగ్లాండ్‌కి చెందిన కామెంటటర్ వ్యాఖ్యానించగా.. పక్కనే ఉన్న మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు. ఆ క్యాచ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:12 pm, Thu, 4 July 19
నీ వాగుడు ఆపు... సంజయ్ మంజ్రేకర్‌పై జడేజా ఫైర్!

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాగా…
ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో గాయపడిన‌ కేఎల్ రాహుల్ స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కొద్దిసేపటికే లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుకున్నాడు. దీంతో.. ఈ క్యాచ్‌ని జడేజా తప్ప టీమిండియా‌లో ఎవరూ పట్టలేరంటూ ఇంగ్లాండ్‌కి చెందిన కామెంటటర్ వ్యాఖ్యానించగా.. పక్కనే ఉన్న మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు.

ఆ క్యాచ్ గురించి మంజ్రేకర్ మాట్లాడుతూ ‘అరకొర‌గా మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లని నేను పెద్దగా అభిమానించను. వన్డేల్లో జడేజా ఈ కోవకి చెందిన క్రికెటరే. టెస్టుల్లో జడేజా ప్యూర్ బౌలర్. కానీ.. వన్డేల్లో మాత్రం అతను బ్యాట్స్‌మెన్ కాదు.. అలా అని స్సిన్నర్ కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు.

సంజయ్ మంజ్రేకర్ మాటలపై జడేజా ఘాటుగా స్పందించాడు. ‘కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. ఆటగాళ్లని గౌరవించడం నేర్చుకో. నేను ఇప్పటికే నీ వెటకార కామెంట్లు చాలా విన్నా. నీ నోటి విరోచనాలు ఇకనైనా ఆపేయ్’ అని జడేజా ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.