Virat Kohli: పాక్‌పై ‘కోహ్లీ’ ఖతర్నాక్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. 77వ సెంచరీతో సచిన్ రికార్డ్ బ్రేక్..
Virat Kohli Records: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో కలిసి 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

Asia cup 2023, Ind vs Pak: టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం, ఆసియా కప్‌లోని సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. దీంతో అతను వన్డే క్రికెట్‌లో తన 13 వేల పరుగులను కూడా పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ ఈ విషయంలో సచిన్ టెండూల్కర్‌ను వదిలి అంతర్జాతీయ క్రికెట్‌లో 77వ సెంచరీని కూడా సాధించాడు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో కలిసి 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో మొత్తం 122 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేసి 106 బంతుల్లో 111 పరుగులు చేశాడు. వీరిద్దరి బలంతోనే టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగులు చేయగలిగింది.
వర్షం కారణంగా దెబ్బతిన్న ఈ మ్యాచ్ సోమవారం పునఃప్రారంభం కాగా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విధ్వంసం సృష్టించారు. విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్‌ను 8 పరుగులతో మొదలుపెట్టి, పరుగుల వర్షం కురిపించాడు. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఇది 47వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఇప్పుడు 77 సెంచరీలు ఉన్నాయి.
సచిన్‌ను వదిలేసిన కోహ్లీ..
13000 ODI runs and counting for 👑 Kohli
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
దీంతో వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సచిన్, కోహ్లీ మధ్య 54 ఇన్నింగ్స్‌ల తేడా ఉంది. ఇప్పటికే అత్యంత వేగంగా 10 వేలు, 11 వేలు, 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు (ఇన్నింగ్స్ ల పరంగా)..
విరాట్ కోహ్లీ – 267 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెండూల్కర్ – 321 ఇన్నింగ్స్‌లు
రికీ పాంటింగ్- 341 ఇన్నింగ్స్‌లు
కుమార సంగక్కర – 363 ఇన్నింగ్స్‌లు
సనత్ జయసూర్య- 416 ఇన్నింగ్స్‌లు
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు..
సచిన్ టెండూల్కర్- 18426 పరుగులు
కుమార్ సంగక్కర- 14234 పరుగులు
రికీ పాంటింగ్- 13704 పరుగులు
సనత్ జయసూర్య- 13430 పరుగులు
విరాట్ కోహ్లీ- 13024 పరుగులు
విరాట్ కోహ్లీ మొత్తం సెంచరీలు..
టెస్టులు: 29
వన్డే: 47
టీ-20: 01
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
