Viral Video: కూతురికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ను తాత్కాలికంగా నిలిపివేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తనకు దొరికిన...

Viral Video: కూతురికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Jeeva
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2021 | 9:00 PM

Viral Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ను తాత్కాలికంగా నిలిపివేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తనకు దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. మహీ తన భార్య సాక్షి, కూతురు జీవా తో కలిసి రాంచీ శివార్లలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. పెంపుడు జంతువులతో సరదాగా గడుపుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ జంతువులను ఎంతగానో ఇష్టపడుతారనే విషయం అందరికీ తెలిసిందే. ధోని ఫామ్‌హౌస్‌లో అనేక కుక్కలు ఉన్నాయి. ధోనీ, ఆయన కూతురు జీవా ఇద్దరూ ఆ పెంపుడు జంతువులతో కలిసి ఆడుతున్న వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ధోనీ సాధు జంతువుల్లో ఓ నల్లటి గుర్రం కూడా వచ్చి చేరింది. దానికి ‘చేతక్’ అని పేరు కూడా పెట్టారు. గత వారం, ఆ ‘చేతక్‌’కు ధోనీ మసాజ్ చేస్తున్న వీడియోను సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇప్పుడు దానికి తోడుగా మరో గుర్రం కూడా తీసుకున్నాడు ధోనీ. ఈ గుర్రానికి ‘పోనీ’ అని పేరు పెట్టిన ధోనీ.. దానిని తన కూతురు జీవాకు బహుమతిగా ఇచ్చాడు. డాడ్ ఇచ్చిన గిఫ్ట్‌ను జీవా తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. కాగా, జీవా ఇన్‌స్టాను ధోనీ, సాక్షి హ్యాండిల్ చేస్తున్నారు. ఈ పోస్టుపై అభిమానులు స్పందించారు. ‘కొత్త ప్రేమకథ’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఐపీఎల్ సీజన్ వాయిదా పడక ముందు జరిగిన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఏడు మ్యాచ్‌లలో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా మ్యాచ్‌ల నిర్వహణను సెప్టెంబర్ నెలకు వాయిదా వేశారు. అవి కూడా గతేడాది మాదిరిగానే యూఏఈలో నిర్వహించనున్నారు.

Also read:

D-Mart Radhakishan Damani: నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులను కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమనీ