Border-Gavaskar trophy: టెస్ట్ సిరీస్‌ను వదిలేసి ఐపీఎల్ ఆక్షన్ కోసం వెళ్ళిపోతున్న ఆ క్రికెట్ దిగ్గజం!
డేనియల్ వెటోరి, ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్, భారతదేశంతో జరగనున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీ టెస్టు మధ్యలో IPL మెగా ఆక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిపోతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపింది. వెటోరి గతంలో కూడా ఫ్రాంచైజీ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి జట్టును వదిలి వెళ్లారు.
క్రికెట్ ఆస్ట్రేలియా సహాయక కోచ్ డేనియల్ వెటోరి, భారతదేశం తో జరిగే బోర్డర్-గవస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మధ్యలో IPL మెగా ఆక్షన్‌లో పాల్గొనడానికి వెళ్ళిపోనున్నాడు. 2022లో ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న వెటోరి, ప్రస్తుతం IPL ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే ఆక్షన్‌కు వెటోరి హాజరు కావాలి, కనుక ఆయన టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు 2 రోజుల పాటు ఆస్ట్రేలియా జట్టుతో ఉంటారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపింది. డానియల్ వెటోరి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పటికీ అతనికి మా సహకారం ఉంటుంది” అని వెల్లడించింది. ఈ నిర్ణయం క్రికెట్ లో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తోంది, ఎందుకంటే మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ కూడా IPL ఆక్షన్‌లో భాగమవుతారు, వారు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ హెడ్ కోచ్‌లుగా పనిచేస్తున్నారు.
వెటోరి గతంలో కూడా పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ సమయంలో ఆయన కొన్ని సార్లు జట్టును వదిలి ఫ్రాంచైజీ కోచ్‌గా వ్యవహరించేవారు. కానీ, ఇదే మొదటిసారి అతను టెస్టు మ్యాచ్ మధ్యలో ఐపీఎల్ ఆక్షన్‌లో పాల్గొనేందుకు వెళ్ళిపోతున్నారు.
వెటోరి 2022 నుండి ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు, అండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పని చేస్తున్నారు. అయితే, గతంలో ఐపీఎల్ వంటి ఫ్రాంఛైజీల కోచ్‌గా బాధ్యతలు నిర్వహించడానికి వెటోరి కొన్ని సిరీస్‌లను విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే, ఈ సారి తొలిసారి, ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సమయంలో ఈ వేలానికి వెళ్లడానికి టెస్ట్ మ్యాచ్‌ను మధ్యగానే వదిలేయడం గమనార్హం.
వెటోరీ అందుబాటులో ఉండకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వహించడానికి మరొకరిని పేస్ బౌలింగ్ కోచ్‌ను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.