Vaibhav Suryavanshi : ఉన్నట్లుండి ఏంటీ ఛేంజ్.. రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీకి ఏమైంది..ఈ తేడాకు కారణం ఏమిటి?
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, అండర్-19 వన్డేలలో వేగవంతమైన సెంచరీ, ఆస్ట్రేలియా గడ్డపై మల్టీ-డే మ్యాచ్‌లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు... ఇలా తన పేరు మీద ఎన్నో రికార్డులు నమోదు చేసుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత మూడు మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి కేవలం 43 పరుగులు మాత్రమే వచ్చాయి.

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, అండర్-19 వన్డేలలో వేగవంతమైన సెంచరీ, ఆస్ట్రేలియా గడ్డపై మల్టీ-డే మ్యాచ్‌లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు… ఇలా తన పేరు మీద ఎన్నో రికార్డులు నమోదు చేసుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత మూడు మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి కేవలం 43 పరుగులు మాత్రమే వచ్చాయి. అది కూడా 10.75 అనే అత్యంత తక్కువ సగటుతో పరుగులు చేయడం, అతని ఆటతీరుకు ఏమాత్రం సరిపోవడం లేదు.
వైభవ్ సూర్యవంశీ అండర్-19 రెడ్-బాల్ కెరీర్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 6 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. మొదటి 3 మ్యాచ్‌లలో అతని సగటు 57.60గా ఉంది. ఇందులో 2 సెంచరీలు సహా మొత్తం 288 పరుగులు చేశాడు. అయితే, మల్టీ-డే సిరీస్‌లలోని రెండవ మ్యాచ్‌ల ప్రదర్శన చూస్తే, గణాంకాలు పూర్తిగా మారిపోయాయి. ఆ 3 మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ సగటు కేవలం 10.75 మాత్రమే, మొత్తం పరుగులు 43 వరకే పరిమితమయ్యాయి.
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కూడా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలో ఇదే ధోరణి కనిపించింది. ఆస్ట్రేలియాపై అతను మొత్తం 4 మల్టీ-డే మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 2 మ్యాచ్‌లు సిరీస్‌లోని మొదటివి కాగా, మిగిలిన 2 మ్యాచ్‌లు సిరీస్‌లో రెండోవి. ఆస్ట్రేలియాపై మొదటి సిరీస్ మ్యాచ్‌లలో వైభవ్ 72.66 సగటుతో ఏకంగా 218 పరుగులు చేశాడు. కానీ, రెండో సిరీస్ మ్యాచ్‌లలో అతని సగటు దారుణంగా 11.50కు పడిపోయింది. పరుగులు 23 మాత్రమే చేయగలిగాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రస్తుత పర్యటనలో కూడా ఈ ధోరణి కొనసాగింది. మొదటి మల్టీ-డే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన రెడ్-బాల్ కెరీర్‌లో అత్యధిక స్కోరు అయిన 113 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, తాజా జరిగిన రెండో మ్యాచ్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జట్టు యాజమాన్యం కూడా అతన్ని ఓపెనింగ్ నుంచి తప్పించి నంబర్ 3లో పంపడం, ఈ వైఫల్యానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అతనికి మరో ఇన్నింగ్స్ ఆడే అవకాశం లభిస్తే, అతను ఈ చరిత్రను తిరగరాయగలడా లేదా అని చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




