AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 ప్రపంచకప్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్

2027 ప్రపంచకప్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్

Phani CH
|

Updated on: Oct 07, 2025 | 4:01 PM

Share

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్స్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అభిమానులకు ఇదో గుడ్‌ న్యూస్‌. 7 నెలల విరామం తర్వాత తమ అభిమాన బ్యాట్స్‌మెన్స్‌ పవర్‌ఫుల్‌ షాట్స్‌ను మళ్లీ తిలకించే అవకాశం రాబోతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోసం భారత జట్టులో విరాట్, రోహిత్ లు చోటు దక్కించుకున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించి జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఓ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించారు.

2027 ప్రపంచ కప్‌లో రెండు జట్ల భాగస్వామ్యం గురించి అగార్కర్ చేసిన అత్యంత ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. 2027 ప్రపంచ కప్‌లో వీరి భాగస్వామ్యం గురించి మాట్లాడాడు. “విరాట్, రోహిత్ ఇద్దరూ ప్రపంచ కప్ గురించి ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు” అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. దీంతో.. చీఫ్ సెలెక్టర్ చేసిన ఈ ప్రకటనపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం, వేర్వేరు సందర్భాలలో ఈ ఇద్దరు ఆటగాళ్లూ.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలనే తమ కోరికను వ్యక్తం చేశారు. కాగా, అగార్కర్‌ తాజా ప్రకటనతో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీరిద్దరూ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో, ఆస్ట్రేలియా పర్యటన అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్, రోహిత్‌ల చివరి పర్యటన కావచ్చనే పుకార్లనూ అగార్కర్‌ తోసిపుచ్చారు. ఇది విరాట్, రోహిత్‌లకు “వీడ్కోలు సిరీస్” అని తాను భావించటం లేదని అగార్కర్ స్పష్టం చేశాడు. అయితే.., శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో యువ జట్టును నిర్మించే ప్రక్రియకు బీసీసీఐ అధికారికంగా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వీరిద్దరికి వీడ్కోలు పలికే అవకాశం లేకపోలేదని క్రీడా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుస సినిమాలతో దూసుకుపోతున్న యూత్ నయా క్రష్

Rashmika Mandanna: క్లౌడ్ నైన్‌లో నేషనల్ క్రష్ రష్మిక

పండుగలను టార్గెట్ చేస్తున్న ప్రభాస్.. పాపం వేరే సినిమాల సంగతేంటి

Rajinikanth: ఇది కదా తలైవా అంటే.. రోడ్డు పక్కన భోజనం

కాంతార: చాప్టర్ 1కు అరుదైన గుర్తింపు.. రాష్ట్రపతి భవన్‌లో స్పెషల్‌