AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఫేవరేట్ ఫుడ్ ఇదే.. కానీ, క్రికెట్ కోసం దూరం పెట్టేశాడు’

Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18లో భాగంగా 47వ మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అది కూడా కేవలం 35 బంతుల్లోనే. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

Vaibhav Suryavanshi: 'వైభవ్ సూర్యవంశీ ఫేవరేట్ ఫుడ్ ఇదే.. కానీ, క్రికెట్ కోసం దూరం పెట్టేశాడు'
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jun 18, 2025 | 1:11 PM

Share

Vaibhav Suryavanshi Diet: భారత అండర్-19 క్రికెట్ జట్టులో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో అతను ప్రదర్శించిన మెరుపులు, టెస్ట్ క్రికెట్‌కు కూడా సరిపోతాయని నిరూపితమైంది. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణిస్తున్న వైభవ్, భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అతని ఈ అసాధారణ ప్రదర్శన వెనుక ఉన్న శక్తి రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వైభవ్ తండ్రి వెల్లడించిన అతని ఆహారపు అలవాట్లలో ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో అద్వితీయ సెంచరీ సాధించి బాస్ బేబీ బిరుదును సంపాదించిన వైభవ్ సూర్యవంశీ, తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడానికి పెద్ద త్యాగం చేశాడు. అది కూడా తనకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవడం ద్వారా. అంటే, టీం ఇండియా తరపున ఆడాలని కలలు కంటున్న వైభవ్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ, ప్రొఫెషనల్ క్రికెట్ కోసం వైభవ్ అదనపు కిలోల బరువు తగ్గించుకుని మంచి శారీరక స్థితిని కలిగి ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతను తనకు ఇష్టమైన ఆహారాలకు కూడా దూరం చేసుకున్నాడు అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఇష్టమైన వంటకం లిట్టి చోఖాకు దూరమయ్యాడు. దీనికి సంజీవ్ మాట్లాడుతూ, “లేదు, అతను ఇప్పుడు లిట్టి చోఖా కూడా తినడు. ఇప్పుడు అతను చాలా సమతుల్య ఆహారం తీసుకుంటాడు. అతను జిమ్‌కు వెళ్తున్నాడు. గతంలో అధిక బరువు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతను అదనపు బరువును తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాడు” అని తెలిపాడు.

కాగా, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఐపీఎల్ ద్వారా తన సామర్థ్యాన్ని వెల్లడించిన వైభవ్‌కు వచ్చే సీజన్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అవకాశం ఇవ్వడం ఖాయం.

అతను మినీ వేలంలో కనిపిస్తే, 9 ఫ్రాంచైజీలు ఆ యువ ఆటగాడి కోసం వేలం వేస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే, ఇంకా టీనేజ్‌లో ఉన్న ఈ యువ బ్యాట్స్‌మన్ ఇప్పటికే ఐపీఎల్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లను ఓడిస్తున్నాడు. అతను ఈ ఫామ్‌లో కొనసాగితే, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో కొత్త సంచలనంగా మారతాడనడంలో సందేహం లేదు.

ఇవన్నీ గ్రహించిన వైభవ్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీని ద్వారా వీలైనంత త్వరగా టీమ్ ఇండియాలో కూడా స్థానం సంపాదించుకుంటానని నమ్మకంగా ఉన్నాడు.

లిట్టి చోఖా అంటే ఏమిటి?

లిట్టి చోఖా అనేది బీహార్ నుంచి వచ్చిన ఫేమస్ ఫుడ్. లిట్టి అనేది గోధుమ పిండితో తయారు చేసిన ఫుడ్. దీనిలో సత్తు (వేయించిన శనగ పిండి), సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. చోఖా అనేది వేయించిన వంకాయ, టమోటా, బంగాళాదుంపల మిశ్రమం. లిట్టిని సాధారణంగా నెయ్యితో వడ్డిస్తారు. చోఖాను కలిపి తింటారు.

వైభవ్ ఆహారంలో ప్రధానంగా ఇవి ఉంటాయి:

పాలు: ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పాలు తాగుతాడు.

పప్పు: భోజనంలో పప్పు ఒక ముఖ్య భాగం.

కూరగాయలు: పప్పుతో పాటు వివిధ రకాల కూరగాయలను తన ఆహారంలో చేర్చుకుంటాడు.

ఫాస్ట్ ఫుడ్ నిరాకరణ: వైభవ్ ఫాస్ట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళడని, అది అతని ఆరోగ్యానికి మంచిది కాదని నమ్ముతాడని ప్రమోద్ తెలిపారు.

ఈ సాధారణ ఆహారపు అలవాట్లతోనే వైభవ్ శారీరకంగా దృఢంగా, మానసికంగా చురుకుగా ఉంటూ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఫిట్‌నెస్, అంకితభావం..

వైభవ్ సూర్యవంశీ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఎంతో అంకితభావంతో ఉన్న వైభవ్, బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి జార్ఖండ్‌కు వచ్చి శిక్షణ తీసుకున్నాడు. అతని తండ్రి కూడా వైభవ్ ఆశయాలను నెరవేర్చడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం వైభవ్ తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో పాటు, తన ఫిట్‌నెస్‌తో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫిట్‌నెస్ వెనుక అతని క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..