Watch Video: వికెట్ పడిన ఆనందంలో హద్దులు మీరిన బౌలర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

ICC Cricket World Cup Qualifier Play-off: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో యూఏఈ ఆల్ రౌండర్ రోహన్ ముస్తఫా వికెట్ తీసిన తర్వాత పరిమితులను అధిగమించాడు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Watch Video: వికెట్ పడిన ఆనందంలో హద్దులు మీరిన బౌలర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
Rohan Mustafa Video
Follow us
Venkata Chari

|

Updated on: Apr 07, 2023 | 8:26 PM

క్రికెట్‌లో ఆటగాళ్ళు వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవడం చేసుకోవడం తరచుగా చూస్తుంటాం. అయితే తాజాగా యూఏఈకి చెందిన ఒక ఆల్ రౌండర్ రోహన్ ముస్తఫా వికెట్ పొందిన ఆనందంలో అన్ని పరిమితులను దాటేశాడు. తన బౌలింగ్‌లో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో నాన్‌స్ట్రైక్‌పై విరుచుకపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

యూఏఈ వర్సె్స్ జెర్సీ మధ్య మ్యాచ్ జరుగుతుంది. జెర్సీ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో రోహన్ ముస్తఫా బౌలింగ్ చేయడానికి వచ్చి నాలుగో బంతికి వికెట్ తీశాడు. రోహన్ తన బౌలింగ్‌లోనే జోష్ లారెన్సన్ ఇచ్చిన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత అతను సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నాన్-స్ట్రైక్ బ్యాట్స్‌మెన్ హారిసన్ కార్లియన్ ఏడీ గార్డ్‌పై బాల్ ఉంచుతూ అసబ్యంగా ప్రవర్తించాడు. రోహన్ ముస్తఫా చర్యలు చూసి హారిసన్ షాక్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

యూఏఈ విజయం..

ఈ మ్యాచ్‌లో యూఏఈ 66 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 284 పరుగులు చేయగా, జెర్సీ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వాసిమ్ 52 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 5 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. ఆసిఫ్ ఖాన్ కూడా 86 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అయాన్ అఫ్జల్ ఖాన్ 49 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..