Watch Video: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్ అంటే ఫుల్ మజా వస్తది: కేకేఆర్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్..

భారత ఆల్ రౌండర్ మన్ దీప్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. 2022లో కొచ్చిలో జరిగిన ఐపీఎల్-2023 వేలంలో మన్‌దీప్‌ను షారుక్ ఖాన్‌కి చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 50 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. మన్‌దీప్‌కు ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది.

Watch Video: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్ అంటే ఫుల్ మజా వస్తది: కేకేఆర్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్..
kkr-star-cricketer-mandeep-singh
Follow us
Venkata Chari

|

Updated on: Apr 07, 2023 | 7:28 PM

Kolkata Knight Riders: భారత ఆల్ రౌండర్ మన్ దీప్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. 2022లో కొచ్చిలో జరిగిన ఐపీఎల్-2023 వేలంలో మన్‌దీప్‌ను షారుక్ ఖాన్‌కి చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 50 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. మన్‌దీప్‌కు ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. అతను ఈ లీగ్‌లో 110 మ్యాచ్‌లలో 20.91 సగటు, 123.02 స్ట్రైక్ రేట్‌తో 1694 పరుగులు చేశాడు. వీటిలో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మన్‌దీప్ గతంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఫ్రాంచైజీలకు కూడా ఆడాడు. మన్‌దీప్ భారత్ తరఫున మూడు టీ20లు కూడా ఆడాడు. తాజాగా టీవీ9 నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. కేకేఆర్ టీంతో తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.

కేకేఆర్‌తో జర్నీ..

కేకేఆర్‌తో జర్నీపై మాట్లాడుతూ.. ఐపీఎల్ లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీ ఎంతో అద్భుతమైనది. టీంతో ఎంతోమంది అనుభవం కలిగిన ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది. ఇది కెరీర్ పరంగా నాకు చాలా సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. దేశ ఆటగాళ్లతోనే కాకుండా.. అంతర్జాతీయ ప్లేయర్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. కేకేఆర్ నా తొలి ఫ్రాంచైజీ. అయితే, 2023లో మరోసారి నా తొలి ప్రాంచైజీతో జతకట్టే ఛాన్స్ దక్కింది.

రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ అంటే టఫ్పే..

ఐపీఎల్ లీగ్‌లో అన్నిజట్లు శక్తవంతంగానే కనిపిస్తున్నాయి. బరిలోకి దిగితే గెలుపు కోసం పోరాడతాయి. అయితే, ముఖ్యంగా రాజస్థాన్ టీంతో మ్యాచ్ అంటే చాలా టఫ్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఆ టీం ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. బ్యాటర్లు, అల్ రౌండర్లు, బౌలర్లు ఇలా అంతా కలసి ఆ టీంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఫేవరేట్ ప్లేయర్..

ఇది చాలా కష్టమైన ప్రశ్నే. కానీ, కేకేఆర్ టీంలో నాకు బాగా నచ్చిన ప్లేయర్ ఒకరు ఉన్నారు. సునీల్ నరైన్ అంటే ఎంతో ఇష్టం. ఆయన బౌలింగ్ చేసే విధానం, మ్యాచ్‌లో నడుచుకునే విధానం ఎంతో నచ్చుతుంది. బిగ్ మ్యాచ్ విన్నర్ కూడా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడి లేకుండా చాలా కూల్‌గా ఉంటాడు. గౌతమ్ గౌంభీర్, రస్సెల్ కూడా బాగా నచ్చుతారు. సునీల్ నరైన్‌లో బాగా నచ్చే అంశం అంటే ఆయన మిస్ట్రీ బౌలింగ్ యాక్షన్. అదే ఆయన స్పెషాలిటీ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..