AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మూడోసారి ట్రోఫీ గెలుస్తాం.. అనుమానాలే వద్దు: కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్..

Kolkata Knight Riders Coach Chandrakant Pandit: టోర్నీ ఇప్పుడే మొదలైంది. ముందుముందు మరింత జోరుగా సాగుతోంది. ట్రోఫీ గెలిచేందుకు మా వంద శాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి బౌలింగ్‌లో కూర్పుల వరకు అన్ని ప్రయోగాలు ప్రారంభించాం.

Watch Video: మూడోసారి ట్రోఫీ గెలుస్తాం.. అనుమానాలే వద్దు: కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్..
Kolkata Knight Riders Coach Chandrakant Pandit
Venkata Chari
|

Updated on: Apr 07, 2023 | 6:46 PM

Share

సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సత్తా చాటింది. మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజృంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. వరుణ్‌ చక్రవర్తి (15/4), సుయాశ్‌ శర్మ (30/3), సునీల్‌ నరైన్‌ (16/2) ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లలో శార్దూల్ ఠాకూర్, రహమానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శార్దూల్ ఠాకూర్‌ 29 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక రహమానుల్లా 44 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అతని స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి.

సొంత మైదానంలో తొలి విజయం అందుకున్నన కేకేఆర్ టీం.. నూతనోత్సాహంతో మిగతా మ్యాచ్‌లకు సిద్ధమవుతోందని, కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ అన్నారు. టీవీ9 నెట్‌వర్క్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు విషయాలపై మాట్లాడారు.

నితీష్ రాణా కెప్టెన్సీపై మాట్లాడుతూ..

గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. మాకు అందుబాటులో ఉన్న ప్లేయర్లను పరిగణలోకి తీసుకుని, కేకేఆర్‌తో అనుభవాల మేరకు నితీష్ రాణాను సారథిగా ఎంచుకున్నాం. ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్. గత 5 సంవత్సరాలుగా కేకేఆర్‌తో రాణా ప్రయాణం సాగుతోంది. టీంలోని సహచరులతోనూ అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ఎక్కువమంది ఇండియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అందుకే రాణా మాకు బెస్ట్ ఛాయస్‌లా అనిపించాడు. ప్రస్తుతం అతను నేర్చుకుంటున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో మరింత రాటుదేలుతాడు.

ఇవి కూడా చదవండి

కేకేఆర్‌తో జర్నీ..

డొమెస్టిక్ క్రికెట్ నుంచి కేకేఆర్ లాంటి టీంలో జాయిన్ అవ్వడం లక్ అనే చెప్పుకోవాలి. టీంలో చాలామంది అనుభవం గల ప్లేయర్లు, డొమెస్టిక్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. అంతా నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

మూడో ట్రోఫీపై ప్లాన్స్..

టోర్నీ ఇప్పుడే మొదలైంది. ముందుముందు మరింత జోరుగా సాగుతోంది. ట్రోఫీ గెలిచేందుకు మా వంద శాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి బౌలింగ్‌లో కూర్పుల వరకు అన్ని ప్రయోగాలు ప్రారంభించాం. రానున్న మ్యాచ్‌ల్లో ఈ మార్పులను చూడొచ్చు. మూడోసారి ట్రోఫీ కచ్చితంగా గెలుస్తామనే భావిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..