Mohammed Shami: రంజాన్ మాసంలో ఇవేం పనులు? షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్! ట్రోలర్స్‌కు ఇచ్చిపడేస్తున్న ఫ్యాన్స్
టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఉపవాసం పాటించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. మండే ఎండలో బౌలింగ్ చేసిన షమీ నీళ్లు తాగడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దేశానికి ప్రాధాన్యత ఇచ్చిన షమీకి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ఉపవాసం వ్యక్తిగత విషయమని, దేశం కోసం ఆడుతున్న ఆటగాడిని విమర్శించడం సరైనది కాదని అంటున్నారు.

టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అసలు నువ్వు ముస్లివేనా? పేరు మాత్రమే ముస్లింలా ఉన్నావ్ అంటూ షమీని దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఇంత దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొవడానికి షమీ చేసిన తప్పేంటో తెలుసా? మత సిద్ధాంతాల కంటే దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన మ్యాచ్‌లో షమీ 3 కీలక వికెట్లు తీసుకొని, జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ముందుగా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. మండే ఎండలో తొలి ఓవర్ వేసిన షమీ.. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలో నీళ్లు తాగుతూ కనిపించాడు.
అంతే రంజాన్ మాసంలో రోజా పాటించకుండా నీళ్లు తాగుతావా? నువ్వు అసలు ముస్లింవేనా? పేరు మాత్రమే ముస్లింవి నువ్వు? అయినా అందరూ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లాలు కాలేరు అంటూ షమీపై కొంతమంది ట్రోలింగ్‌కు దిగారు. ఆమ్లా గతంలో ఫాస్టింగ్(రోజా) ఉండి మ్యాచ్ ఆడాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ షమీ రోజా పాటించకుండా మ్యాచ్ ఆడాడని అతన్ని తిడుతున్నారు. అయితే మధ్యాహ్నం మండే ఎండలో గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఓ పది ఓవర్లు బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని, బౌలర్లు రోజా పాటిస్తూ మ్యాచ్ ఆడటం అంత తేలికైన విషయం కాదని షమీని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. పైగా అది సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ కాబట్టి షమీ రోజా పాటించకుండా తన దేశానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోజాను పాటించకపోయినా పర్వాలేదని, తర్వాత ఎప్పుడైనా మిస్ అయిన రోజాకు బదులుగా మరో రోజు రోజా పాటించవచ్చని కూడా కొంతమంది ముస్లింలు షమీకి మద్దతు తెలుపుతున్నారు.
ఈ విషయంపై షమీ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. పాకిస్థాన్ వాళ్లు కూడా రోజా పాటించకుండానే మ్యాచ్ ఆడుతున్నారని, షమీ చేసినదాంట్లో తప్పేంలేదని అంటున్నారు. ఈ వివాదాస్పద విషయంలో షమీకే ఎక్కువగా మద్దతు లభిస్తోంది. దేశం కోసం ఒక ఐసీసీ ఈవెంట్‌లో కీలకమైన సెమీ ఫైనల్ ఆడుతూ.. జట్టులో సీనియర్ మెయిన్ బౌలర్ కావడంతో షమీ పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ వేసేందుకు రోజాను కూడా త్యాగం చేయడం గొప్ప విషయం అని, అయినా మత నియమాలు పాటించాలా? వద్దా ? అనేది వ్యక్తిగత విషయం అయిన, షమీ రోజా ఉండాలా వద్దా అనేది వేరే వాళ్లు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదని కూడా నెటిజన్లు ట్రోలింగ్ చేసేవారికి కౌంటర్‌గా పోస్టులు పెడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న సమయంలో ఇలాంటి చిన్నచిన్న విషయాలను రాద్ధాంతం చేయడం సరికాదని కూడా హితవు పలుకుతున్నారు.
అలాగే గతంలో షమీతో విడిపోయిన అతని మాజీ భార్య షమీపై దేశద్రోహి అనే ఆరోపణలు చేసింది. ఆ సమయంలో నేను ప్రాణాలైన వదిలేస్తాను కానీ, నా దేశానికి ద్రోహం చేయను అని షమీ స్పష్టంగా చెప్పాడు. అలాగే వన్డే వరల్డ్ కప్ 2023లో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన తర్వాత గ్రౌండ్‌లో సజ్దా చేసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడని విమర్శలు వచ్చినప్పుడు, నేను గ్రౌండ్‌లో సజ్దా చేయాలనుకుంటే నన్ను ఎవరు ఆపలేరు అంటూ చాలా ధైర్యంగానే సమాధానం చెప్పాడు షమీ. సో.. షమీ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడనే విషయం స్పష్టం. అలాగే తన మతాన్ని కూడా అతను పూర్తిగా గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిని అనవసరంగా ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
Maulana is attacking Mohammad Shami for drinking water during a match, even calling him a ‘criminal’ for not fasting & going against Sharia.
Why aren’t the likes of Rahul Gandhi, 2BHK & RR Ravish taking a stand for Shami against Islamists? pic.twitter.com/VJqrQGsROO
— BALA (@erbmjha) March 6, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
