Video: ఎవడు మమ్మీ వీడు.. 20 బంతుల్లో 5 వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలింగ్‌తో బీభత్సం.. వైరల్ వీడియో
The Hundred 2024: ది హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరపున ఆడుతున్న టిమ్ సౌథీ తన డేంజరస్ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అది కూడా 20 బంతుల్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. సౌతీ ఈ ప్రదర్శన కారణంగా, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
Birmingham Phoenix vs Trent Rockets: ఇంగ్లండ్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్‌లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మెరుపు దాడితో అందరి దృష్టిని ఆకర్షించాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ జట్టు టిమ్ సౌథీ ధాటికి తడబడింది.
డేంజరస్ బౌలింగ్‌తో దాడి చేసిన టిమ్ సౌథీ కేవలం 20 బంతుల్లో 13 డాట్ బాల్స్ వేశాడు. 12 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూడా తీశాడు. సౌథీ గట్టి ధాటికి ట్రెంట్ రాకెట్స్ జట్టు 100 బంతుల్లో 118 పరుగులు చేసింది.
A 5️⃣-wicket haul to remember! 🤩
Tim Southee registered the second-best bowling figures in the men’s competition, powering Birmingham Phoenix to a vital win with his spell of 5/12. 🔥#TheHundredonFanCode pic.twitter.com/kCirYLFVT9
— FanCode (@FanCode) August 13, 2024
119 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరపున ఓపెనర్ బెన్ డకెట్ 30 పరుగులు చేయగా, లియామ్ లివింగ్‌స్టోన్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. జాకబ్ బెతెల్ 93 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో బర్మింగ్‌హామ్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ ఓటమితో ట్రెంట్ రాకెట్స్ జట్టు హండ్రెడ్ లీగ్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ట్రెంట్ రాకెట్ 7 మ్యాచ్‌లు ఆడగా 3 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీని ద్వారా, 2024 హండ్రెడ్ లీగ్ నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైంది.
ఇరు జట్లు:
ట్రెంట్ రాకెట్స్ (ప్లేయింగ్ XI): టామ్ బాంటన్ (కీపర్), అలెక్స్ హేల్స్, జో రూట్, టామ్ అల్సోప్, రోవ్‌మన్ పావెల్, ఇమాద్ వాసిమ్, లూయిస్ గ్రెగొరీ(కెప్టెన్), క్రిస్ గ్రీన్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్, సామ్ కుక్.
బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, మోయిన్ అలీ(కెప్టెన్), జామీ స్మిత్(కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, డాన్ మౌస్లీ, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, సీన్ అబాట్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, క్రిస్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..