IND vs WI: తొలి టెస్టులో విజయం.. రెండో మ్యాచ్‌లో మార్పులంటూ రోహిత్ ప్రకటన.. మరో ఇద్దరు అరంగేట్రం?
India vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండోది, చివరి టెస్ట్ మ్యాచ్ జులై 20 నుంచి క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11పై కీలక ప్రకటన చేశాడు.
India vs West Indies 1st Test: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 3వ రోజు ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన కరీబియన్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలోనే 130 పరుగులకు చాప చుట్టేసింది. అదే సమయంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 271 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తదుపరి మ్యాచ్ ఆడే 11మంది ప్లేయర్లపై కీలక ప్రకటన చేశాడు.
టీమిండియా ప్లేయింగ్ 11 మారనుంది?
తొలి మ్యాచ్ విజయం తర్వాత, క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేయాలని రోహిత్ శర్మ సూచించాడు. జులై 20 నుంచి ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. రోహిత్ మాట్లాడుతూ, ‘అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇన్నింగ్స్‌ను మేం బాగా ప్రారంభించడం. మేం పిచ్ గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. మేం ఇక్కడకు వచ్చి ఫలితాలను పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు మేం ఈ వేగాన్ని రెండవ టెస్ట్‌లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఎక్కువ టెస్టులు ఆడని కొందరు ఆటగాళ్లు ఉన్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీకర్ భరత్, రీతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీలు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోయారు’. అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం..
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘అతనిలో ప్రతిభ ఉంది, అతను సిద్ధంగా ఉన్నాడని గతంలోనే చూపించాడు. అతను వచ్చి తెలివిగా బ్యాటింగ్ చేశాడు. మా సంభాషణ అతను విలువైనవాడని అతనికి గుర్తు చేయడానికే. ఇంతకు ముందు కష్టపడి పని చేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేశాడు. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా గురించి రోహిత్ మాట్లాడుతూ, ‘ఫలితాలు తమకు తాముగా చెప్పుకుంటాయి. వారు కొంతకాలంగా ఈ పని చేస్తున్నారు. వారికి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. అది వారి భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను ఇవ్వడం. ఇలాంటి పిచ్‌లను అనుభవించడం వారికి చాలా ఈజీ. అశ్విన్, జడేజా ఇద్దరూ అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా అశ్విన్ ఇలా రావడం, అలా బౌలింగ్ చేయడం అద్భుతమైనది’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..