ODI World Cup 2023 రేసు నుంచి 20 మంది ఆటగాళ్లు ఔట్.. ఒక్క ప్రకటనతో షాకిచ్చిన బీసీసీఐ.. లిస్టులో ఎవరున్నారంటే?
Team India: భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ఆసియా క్రీడలు 2023లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరు 23 నుంచి టీమ్ ఇండియా ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇదుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. 5గురు ఆటగాళ్లను స్డాండ్‌బైగా ఉంచారు.
Asian Games 2023: భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ఆసియా క్రీడలు 2023లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరు 23 నుంచి టీమ్ ఇండియా ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇదుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. 5గురు ఆటగాళ్లను స్డాండ్‌బైగా ఉంచారు. ఈ జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ఈ జట్టుతో పాటు 20 మంది ఆటగాళ్ల హృదయాలను బద్దలు కొట్టింది. ఈ 20 మంది ఆటగాళ్లు ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సంపాదించడానికి రేసు నుంచి ఔట్ అయినట్లేనని తెలుస్తోంది.
ఒక ప్రకటనతో 20 మంది ఆటగాళ్ల హార్డ్ బ్రేక్..
ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో పేర్లున్న వారు వన్డే ప్రపంచకప్‌లో ఆడరని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆసియా క్రీడలకు సంబంధించిన జట్టును శుక్రవారం ప్రకటించారు. భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత.. మాజీ BCCI అధికారి సబా కరీమ్ ఆటగాళ్లందరి పేర్లను చదివి వినిపించారు. ఈ సమయంలో ఆయన ఆసియా గేమ్స్‌లో ఎవరు ఆడతారో వారు ప్రపంచ కప్ జట్టులో భాగం కాదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే రెండు టోర్నమెంట్లు ఒకే సమయంలో ఆడాల్సి ఉంది కాబటి.
భారత జట్టు తొలిసారి ఆసియా గేమ్స్‌లో..
ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానున్నాయి. అక్టోబర్ 8న ముగియనున్నాయి. అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి భారత్‌లో మొదలు కానుంది. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జట్టుతో ఏకంగా 20 మంది ప్లేయర్లకు ప్రపంచకప్ 2023 జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. క్రికెట్ ఏషియాడ్ చరిత్రలో మూడు సార్లు మాత్రమే ఆడింది. అయితే ఆసియా గేమ్స్ టోర్నీకి భారత్ ఒక్కసారి కూడా తమ జట్టును పంపలేదు. అదే సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా, ఈ మెగా ఈవెంట్‌లో పురుషులు, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనవని భారత క్రికెట్ బోర్డు ఇంతకుముందు చెప్పింది. అయితే బీసీసీఐ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు:
రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే,ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్స్: సాయి కిషోర్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్, వెంకటేష్ అయ్యర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..