Team India: యశస్వి హిస్టారికల్ ఇన్నింగ్స్‌తో.. రిటైర్మెంట్ బాటలో సీనియర్ ప్లేయర్.. కెరీర్ ఖేల్ ఖతం.. ఎందుకంటే?

IND vs WI 1st Test: డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌లోని ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లిద్దరూ సెంచరీలు నమోదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Team India: యశస్వి హిస్టారికల్ ఇన్నింగ్స్‌తో.. రిటైర్మెంట్ బాటలో సీనియర్ ప్లేయర్.. కెరీర్ ఖేల్ ఖతం.. ఎందుకంటే?
Rohit Sharma And Yashasvi J
Follow us
Venkata Chari

|

Updated on: Jul 15, 2023 | 6:30 AM

IND vs WI 1st Test: డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌లోని ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లిద్దరూ సెంచరీలు నమోదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఓ సీనియర్ ఆటగాడి కెరీర్‌ను పూర్తిగా ముగించాడు.

యశస్వి దెబ్బకు ఈ అనుభవజ్ఞుడి కెరీర్‌కు ఫుల్‌స్టాప్..

తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే, టీమిండియా వెటరన్ ప్లేయర్ కెరీర్‌కు ముగింపు పలికాడు. యశస్వి ఇలాగే ప్రదర్శనను కొనసాగిస్తే, ఏ ఫార్మాట్‌లోనైనా సెలెక్టర్లు ఈ ప్లేయర్‌ను విస్మరించడం చాలా కష్టం. యశస్వి తన టెస్టు అరంగేట్రం చేసినప్పటికీ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో 387 బంతుల్లో 171 పరుగులు చేసి మూడోరోజు పెవిలియన్ చేరాడు.

ఈ ఆటగాడికి రిటైర్మెంట్ మాత్రమే ఆఫ్షన్..

తన ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి, 171 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అయితే, భారత టెస్టు జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ పునరాగమనం దాదాపుగా కష్టమైంది. యశస్వి అద్భుత ఇన్నింగ్స్‌తో శిఖర్ ధావన్ అన్ని తలుపులు మూసేశాడు. 37 ఏళ్ల శిఖర్ పరిమిత ఓవర్లలో మాత్రమే ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు టెస్టు అరంగేట్రంలో భారత్ తరఫున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఏకైక బ్యాట్స్‌మెన్ శిఖర్ కావడం విశేషం.

టీమిండియా శాశ్వత ఓపెనర్‌ అయ్యేందుకు ఛాన్స్..

శుభ్‌మన్ గిల్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వద్దకు వెళ్లి నంబర్-3లో పంపాలని కోరాడని తెలుస్తోంది. అది కూడా ఈ మ్యాచ్‌లో చూశాం. ఇటువంటి పరిస్థితిలో గిల్ మాత్రమే భారత టెస్టు జట్టులో నంబర్-3లో ఆడటం కొనసాగుతుంది. వెస్టిండీస్‌పై యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఎలాంటి బ్యాటింగ్ చేశాడో చూస్తే.. అతను టీమిండియాకు శాశ్వత ఓపెనర్ అవుతాడని స్పష్టమైంది. అతని ప్రత్యేకత ఏమిటంటే, అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. ఇటువంటి పరిస్థితిలో కుడి-ఎడమ కలయిక కూడా టీమిండియాకు అందుబాటులో ఉంది.

ధావన్‌కు కష్టమైన మార్గం..

వెస్టిండీస్‌ పర్యటనలో సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను ఏ ఫార్మాట్‌లోనూ జట్టులోకి తీసుకోలేదు. అతను ఇంతకు ముందు చాలా కాలం పాటు వన్డే ఫార్మాట్‌లో భాగమయ్యాడు. తాజాగా భారత జట్టు నుంచి కూడా నిష్క్రమించే మార్గం చూపించినట్లైంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా, ధావన్‌ తమ ప్రణాళికలో భాగం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితిలో ధావన్‌కు ముందు మార్గం చాలా కష్టం. ఇప్పటి వరకు 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..