AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నార్త్ స్టాండ్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించే ప్రక్రియను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్ మంగళవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ని ఆదేశించారు.

అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
Azharuddin
Venkata Chari
|

Updated on: Apr 30, 2025 | 12:14 PM

Share

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అజహరుద్దీన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అజహరుద్దీన్ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టి, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది. రెండు దశాబ్దాల పాటుగా క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించానని, అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టును విజ్ఞప్తి చేయడంతో హైకోర్ట్ స్టే విధించింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు పెట్టడం విరుద్ధ ప్రయోజనాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ అజారుద్దీన్ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో పైవిధంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

అజారుద్దీన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కె. రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరాలకు పైగా అమలులో ఉందని, మాజీ క్రికెటర్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘిస్తుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

హెచ్‌సీఏ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టాండ్‌కు అతని పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని, ఇది స్వప్రయోజనాల కోసమే ఇలా చేశారని అన్నారు. ఎటువంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వవద్దని కోరారు.

ఇరు వైపుల వాదనలను సమీక్షించిన హైకోర్ట్, తదుపరి విచారణ తేదీ వరకు అజారుద్దీన్ పేరు తొలగింపునకు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ కార్తీక్ హెచ్‌నీఏను ఆదేశించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..