Video: ఆ కన్నీళ్లు అతడి స్పిరిట్ కి నిదర్శనం! కింగ్ కోహ్లీ ఆవేశంపై పంటర్ కామెంట్స్
2025 ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టడం అభిమానుల మనసును కదిలించింది. మ్యాచ్ అనంతరం భార్య అనుష్కను ఆలింగనం చేసుకుంటూ కోహ్లీ ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ దృశ్యంపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, ఇది క్రికెట్ ఆత్మను చూపిందన్నారు. కోహ్లీ ఐపీఎల్ విజయం గొప్పదేనని చెప్పినా, టెస్టులకున్న గౌరవం మరింత ఉన్నదని స్పష్టం చేశాడు. ఈ విజయం ద్వారా RCB, ఐపీఎల్‌లోని అగ్ర జట్ల జాబితాలో స్థానం సంపాదించింది.

2025 ఐపీఎల్ ఫైనల్ చివరి క్షణాల్లో విరాట్ కోహ్లీ కన్నుల్లో కనిపించిన నీళ్లు, ఆ క్షణాల్లో ఆయన చూపిన ఆవేశం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సాధించిన తొలి టైటిల్ విజయంలోని అర్థాన్ని ప్రతిబింబించాయి. 17 ఏళ్ల నిరీక్షణ, ఎన్నో ప్రయత్నాల తర్వాత, బెంగళూరు జట్టు అహ్మదాబాద్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
కోహ్లీ మైదానంలో మోకాలిపై కూర్చుని కన్నీళ్లతో తన భావోద్వేగాన్ని వెల్లగక్కాడు. అనంతరం భార్య అనుష్క శర్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ మళ్లీ కంటతడి పెట్టాడు. ఈ దృశ్యాలను చూసిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, ఆ క్షణం గేమ్ స్పిరిట్‌ను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
కోహ్లీ కన్నీళ్లపై స్పందించిన పాంటింగ్
“చివరి ఓవర్లో అతని కళ్లల్లో మీరు చూస్తే అర్థమవుతుంది. అతను ఏడుస్తున్నాడు. ఆటగాళ్లకి ఇది ఎంత అర్థవంతమైందో చెప్పేందుకు అదే నిదర్శనం. చెన్నై, ముంబయిలా ఎన్నిసార్లు గెలిచిన జట్లు ఉన్నా, ఈ టోర్నమెంట్ గెలవడం అంత ఈజీ కాదు. దీనిని గెలవాలంటే చాలా ఆలోచించాలి, శ్రమించాలి,” అని పాంటింగ్ ఫైనల్ తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. ఆర్సీబీ మొత్తంగా ఈ సారి మంచి జట్టుతో బరిలోకి దిగి అనుకున్నది సాధించారు.
టెస్ట్‌లతో పోలిస్తే ఐపీఎల్ విజయానికి కోహ్లీ స్పందన
ఐపీఎల్ టైటిల్‌ను తన కెరీర్‌లో గొప్ప ఘట్టంగా పేర్కొన్న కోహ్లీ, టెస్ట్ క్రికెట్‌కున్న ప్రాధాన్యతను మరోసారి వివరించాడు. ఈ క్షణం నా కెరీర్‌లో అద్భుతమైన క్షణాల్లో ఒకటి. కానీ ఇది టెస్టులకు ఐదు మెట్లు కిందే. యువ క్రికెటర్లు టెస్టులకు గౌరవం ఇవ్వాలి. టెస్టుల్లో మీరు రాణిస్తే, మీరు ప్రపంచంలో ఎక్కడైనా నడిచినా, ప్రజలు మీ కళ్లలోకి చూసి హ్యాండ్‌షేక్ చేస్తారు. అది నిజమైన గౌరవం, అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలపై పాంటింగ్ సమ్మతం తెలిపాడు. “నిజమే, నేను కూడా ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌నే నిజమైన ఆటగా ప్రేమిస్తున్న puristని. నేను కోచ్‌గా ఉన్నా, కామెంటేటర్‌గా ఉన్నా… టెస్టులంటే నాకు ఎంతో ప్రేమ,” అని చెప్పాడు. ఈ విజయం ద్వారా, ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లను RCB వెనక్కి నెట్టి గొప్ప స్థాయికి చేరింది. దీంతో RCB ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్లకు కప్పును ముద్దాండింది. ఇది లీగ్ లోనే అత్యంత ప్రజాదారణ పొందిన గెలుపుగా నిలిచింది.
Every kohli fan cried here pic.twitter.com/2lYjtQpa1F
— Abxd (@ABXD_DC) June 3, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



