INDW vs AUSW: ఆస్ట్రేలియాపై రికార్డు ఇన్నింగ్స్.. మంధనా-హర్మన్ ప్రీత్‌‌లను వెనక్కు నెట్టిన యంగ్ స్టార్ ప్లేయర్

వర్షం కారణంగా ఆట రద్దయ్యే సమయానికి జెమీమా రోడ్రిగ్స్ 36 బంతుల్లో 49 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో తన పేరు మీద ఓ భారీ రికార్డును లిఖించుకుంది.

INDW vs AUSW: ఆస్ట్రేలియాపై రికార్డు ఇన్నింగ్స్.. మంధనా-హర్మన్ ప్రీత్‌‌లను వెనక్కు నెట్టిన యంగ్ స్టార్ ప్లేయర్
Jemimah Rodrigues
Follow us
Venkata Chari

|

Updated on: Oct 07, 2021 | 5:45 PM

Jemimah Rodrigues: టీ 20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీంలు తలపడుతున్నాయి. అయితే వర్షం కారణంగా ఈమ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచులో భారత మహిళలు అద్భుతంగా రాణించారు. మొదట్లో మంచి ఆరంభమే లభించింది. కానీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక వైపు జట్టు వికెట్లు కోల్పోతున్నా.. మరొక వైపు నుంచి యంగ్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఆ చక్కని ఇన్నింగ్స్‌తో పాటు, తన పేరు మీద ఓ భారీ రికార్డును కూడా లిఖించుకుంది.

క్వీన్స్‌ల్యాండ్‌లో జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ 15.2 ఓవర్లలో 131 పరుగులు చేసింది. దీని తర్వాత మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత్‌ తరపున జెమిమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు చేసింది. 36 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో స్మృతి మంధనా, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ క్లబ్‌లో చేరింది.

ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అనేక రికార్డులు బద్దలు.. జెమీమా రోడ్రిగ్స్ 10 వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టింది. ఈ ఫోర్‌తో ఆమె స్కోర్ 21 కి చేరింది. T20 ఫార్మాట్‌లో తన 1000 పరుగులను పూర్తి చేసింది. మంధనా హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్ తర్వాత అలా చేసిన మూడో మహిళా ప్లేయర్‌గా ఆమె ఘనత సాధించింది. అలాగే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా కూడా ఆమె రికార్డులకు ఎక్కింది. జెమిమా 21 సంవత్సరాల 32 రోజుల వయస్సులో టీ20 లో 1000 పరుగులు పూర్తి చేసింది. ఆమె కంటే ముందు ఈ రికార్డు స్టెఫానీ టేలర్ పేరు మీద ఉంది. ఆమె 21 సంవత్సరాల 111 రోజుల వయస్సులో 1000 టీ20 పరుగులు పూర్తి చేసింది. మిథాలీ రాజ్ తర్వాత అత్యంత వేగంగా 1000 టీ 20 పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. మిథాలీ ఈ స్థానాన్ని 40 ఇన్నింగ్స్‌లలో సాధించగా, జెమిమా 48 ఇన్నింగ్స్‌లలో చేరింది.

వన్డే సిరీస్‌లో ఎంపిక కాలే.. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టులో జెమీమా ఎంపిక కాలేదు. కానీ, ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ సిరీస్‌లో నార్తర్న్ సూపర్‌ఛార్జర్‌ల తరపున ఆకట్టుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేసింది. ఈ టీ20 సిరీస్ తర్వాత జెమిమా రోడ్రిగ్జ్ రాబోయే మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడబోతోంది. లీగ్‌లో 21 ఏళ్ల జెమీమాకు ఇది మొదటి సీజన్. అక్టోబర్ 14 నుంచి ప్రారంభమయ్యే లీగ్‌లో షెఫాలీ వర్మ, రాధా యాదవ్ కూడా సిడ్నీ సిక్సర్‌ల తరపున బరిలోకి దిగనున్నారు.

Also Read: IPL 2021 CSK vs PBKS: డు ప్లెసిస్‌ చెలరేగడంతో గట్టెక్కిన చెన్నై.. పంజాబ్‌ విజయ లక్ష్యం ఎంతంటే..

Mumbai Indians: వావ్.. మరీ ఇంతలానా.. ఇంతకు ముందెన్నడూ చూడలే.. ఎంఐ ప్లేయర్ షాట్‌కు నెటిజన్లు ఫిదా

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!