IPL 2021 CSK vs PBKS: డు ప్లెసిస్‌ చెలరేగడంతో గట్టెక్కిన చెన్నై.. పంజాబ్‌ విజయ లక్ష్యం ఎంతంటే..

Chennai Super Kings vs Punjab Kings: ప్లేఆఫ్‌లో స్థానం దక్కించుకోవడంలో భాగంగా పంజాబ్‌కు కీలకంగా మారిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌..

IPL 2021 CSK vs PBKS: డు ప్లెసిస్‌ చెలరేగడంతో గట్టెక్కిన చెన్నై.. పంజాబ్‌ విజయ లక్ష్యం ఎంతంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 07, 2021 | 5:28 PM

Chennai Super Kings vs Punjab Kings: ప్లేఆఫ్‌లో స్థానం దక్కించుకోవడంలో భాగంగా పంజాబ్‌కు కీలకంగా మారిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ అందుకు తగ్గుట్లుగానే సక్సెస్‌ అయ్యిందని చెప్పాలి. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌ బౌలర్ట దాటికి చెన్నై బ్యాట్స్‌మెన్‌ వెంటవెంటనే పెవిలియన్‌ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయిన చెన్నై 134 పరుగులు చేసింది. అయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఇలా తడబడడం గమనార్హం. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో డు ప్లెసిస్‌ ఒక్కడే ఎక్కవ పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన డుప్లెసిస్‌ 46 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 55 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు.

అయితే మిగతావారంతా 20 పరుగుల లోపే అవుట్‌ అయ్యారు. రుతురాజ్‌ గ్వైక్వాడ్‌ 12 పరుగులు చేసి షారుఖ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక మొయిన్‌ అలీ డకౌట్‌ కాగా, రాబిన్‌ ఉతప్ప కూడా రెండు పరుగులకే అవుటయ్యాడు. అనంతరం వచ్చిన అంబటి రాయుడు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం జట్టు బాధ్యతను చేపట్టిన ధోని ఆ దిశగా అడుగులు వేశాడని అనుకుంటున్న లోపే 12 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఇక చెన్నై మరీ తక్కువ స్కోరుకే పరిమితమవుతోందా.? అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా, డుప్లెసిస్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో చెన్నై ఈ మాత్రం పరుగులు చేయగలిగింది. 76 పరుగులు చేసిన డు ప్లెసిస్‌ చివరి ఓవర్‌లో జట్టు స్కోరు పెంచే క్రమంలో మొదటి రెండు బంతులకు ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టి మూడో బంతికి అవుటయ్యాడు.

ఇక పంజాబ్‌ బౌలర్లలందరూ రాణించడంతో చెన్నైని తక్కువ స్కోరుకు పరిమితం చేశారని చెప్పాలి. పంజాబ్‌ బౌలర్స్‌ అర్షదీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌ చేరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక రవి బిష్ణోని ఒక వికెట్‌ పడగొట్టాడు. మహమ్మాద్‌ షమీ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మరి బౌలింగ్‌కు సపోర్ట్‌ చేస్తున్న ఈ పిచ్‌పై చెన్నై బౌలర్లు పంజాబ్‌ను కట్టడి చేస్తారా.? లేదా చూడాలి.

Also Read: Nobel Prize in Literature: సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విజేత అబ్దుల్‌రాజాక్ గుర్నా.. ప్రకటించిన కమిటీ!

Mumbai Indians: వావ్.. మరీ ఇంతలానా.. ఇంతకు ముందెన్నడూ చూడలే.. ఎంఐ ప్లేయర్ షాట్‌కు నెటిజన్లు ఫిదా

Samantha Ruth Prabhu : గేమ్ షోకు గెస్ట్‌గా సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..!!