AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Super 8 Stage: టీమిండియాకు సూపర్ 8 గండం.. షాకిస్తోన్న ‘3’వ నంబర్.. అదే జరిగితే 4వసారి ఇంటికే

T20 World Cup 2024: ఈ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో సూపర్-8 రౌండ్‌లోకి ప్రవేశించింది. సూపర్-8లో భారత్ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ ఇండియా ఓటమి ఎరుగలేదు. ఈ స్థితిలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే ప్రశ్న క్రికెట్ అభిమానులందరిలో మెదులుతోంది.

India Super 8 Stage: టీమిండియాకు సూపర్ 8 గండం.. షాకిస్తోన్న '3'వ నంబర్.. అదే జరిగితే 4వసారి ఇంటికే
Team India
Venkata Chari
|

Updated on: Jun 19, 2024 | 2:52 PM

Share

Team India’s Performance In Super 8 Stage: ఈ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో సూపర్-8 రౌండ్‌లోకి ప్రవేశించింది. సూపర్-8లో భారత్ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ ఇండియా ఓటమి ఎరుగలేదు. ఈ స్థితిలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే ప్రశ్న క్రికెట్ అభిమానులందరిలో మెదులుతోంది. గత 8 ఎడిషన్లలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణించింది? తెలుసుకోవడం చాలాముఖ్యం. అయితే సూపర్ 8 రౌండ్‌లో టీమ్ ఇండియాకు 3 సార్లు షాకులు తగిలాయి.

2009లో మొత్తం 3 మ్యాచ్‌ల్లో ఓటమి..

2007లో జరిగిన తొలి ఎడిషన్‌ టోర్నీలో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2009లో రెండో ఎడిషన్‌లో భారత్‌ సూపర్‌-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఇలా మూడు జట్లతో తలపడింది. అయితే, ఈ మూడు జట్లపైన ఓటమి పాలైంది. దీంతో గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2010లో అదే కథ..

2010 ప్రపంచకప్‌లో గ్రూప్ సీలో భాగంగా భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో తలపడిన టీమిండియా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచి ప్రయాణాన్ని ముగించింది.

2012లో నెట్ రన్ రేట్ దెబ్బ..

2009, 2010 ప్రపంచకప్‌ల మాదిరిగానే 2012 ప్రపంచకప్‌లోనూ భారత్‌ మరోసారి సూపర్‌-8 రౌండ్‌కు దూరమైంది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడింది, 2 జట్లపై గెలిచి ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ, నెట్ రన్ రేట్ పరంగా పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండటంతో భారత జట్టు ఈసారి కూడా సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించింది.

ఈసారి కూడా మూడు జట్లతోనే పోరు..

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మూడు జట్లపై భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ల ఫామ్‌ను చూస్తుంటే భారత్‌ సెమీఫైనల్‌ ప్రయాణం అంత సులువు కాదని తెలుస్తోంది. కాబట్టి ఈ రౌండ్‌లో భారత్ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు