AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: జైస్వాల్ డబుల్ సెంచరీ.. సెలబ్రేషన్స్‌తో పిచ్చెక్కించిన సర్ఫరాజ్.. వీడియో చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా, 2వ, 3వ మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోయినట్లే.

Video: జైస్వాల్ డబుల్ సెంచరీ.. సెలబ్రేషన్స్‌తో పిచ్చెక్కించిన సర్ఫరాజ్.. వీడియో చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..
Sarfaraz Khan Celebrates Yashasvi Jaiswal's Double Century
Venkata Chari
|

Updated on: Feb 19, 2024 | 10:41 AM

Share

Sarfaraz Khan Celebrates Yashasvi Jaiswal’s Double Century: రాజ్‌కోట్‌లోని నిరంజన్‌షా మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) సెంచరీల సాయంతో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియాకు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు.

ముఖ్యంగా విజయవంతమైన జైస్వాల్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. జైస్వాల్ 231 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేయగా.. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ తన సొంత డబుల్ సెంచరీలా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈమేరకు ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి.

యస్షవి జైస్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేయడానికి పరుగు కోసం పరిగెత్తుతుండగా, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇటువైపు నుంచి తన బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ఇద్దరు యువ ప్లేయర్ల వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అజేయంగా 214 పరుగులు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ అజేయంగా 68 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ లో 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రవీంద్ర జడేజా స్పిన్ ధాటికి కుప్పకూలింది. ఫలితంగా కేవలం 122 పరుగులకే ఆలౌటయి 434 పరుగులకే ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా తరుపున చక్కటి బౌలింగ్‌ను ప్రదర్శించిన రవీంద్ర జడేజా 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి, ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇరుజట్లు..

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.

ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి