AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mithali Raj: ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీరాజ్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళగా రికార్డు..!

టీమిండియా ఉమెన్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న రాత్రి ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ టీం ఎట్టకేలకు ఓ విజయం సాధించింది.

Mithali Raj: ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీరాజ్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళగా రికార్డు..!
Mithali Raj
Venkata Chari
|

Updated on: Jul 04, 2021 | 3:24 PM

Share

Mithali Raj: టీమిండియా ఉమెన్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న రాత్రి ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ టీం ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో 2-1 తేడాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ను గెలుచుకుంది. ఇక ఆఖరి వన్డేలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మిథాలీ రాజ్ (75 నాటౌట్‌; 86 బంతుల్లో 8×4) ) ఓ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆమె పేరుతో అత్యధిక వన్డేలు ఆడిన మహిళగా రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎక్కువకాలం క్రికెట్ ఆడిన మహిళగాను రికార్డుల్లోకి ఎక్కింది. వీటితో పాటు మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగాను చరిత్ర సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ 10,337 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఛార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (10,273) పేరుతో ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేసింది.

మ్యాచ్ అనంతరం మిథాలీ రాజ్ మాట్లాడుతూ, పరుగుల దాహం నాకింకా తీరలేదని.. 2022లో జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ బాగా రాణించేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘నా క్రికెట్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. చాలా ఒడుదొడుకులు.. అంతకు మించి మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆ టైంలో క్రికెట్ కు గుడ్ బై చెబుదామని అనుకున్నాను. అయితే, ఏదో నన్ను మరింత ముందుకు నడిపిస్తోంది. అదే నన్ను 22 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగించేలా చేసింది. పరుగులు చేయాలనే దాహం మాత్రం నాకింకా తగ్గలేదు. టీమ్‌ఇండియా ఖాతాలో ఇంకొన్ని విజయాలు చేర్చాలని అనుకుంటున్నాను. ఈ క్రమంలో నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం వాటిపైనే ఫోకస్ చేశాను’ అని ఆమె పేర్కొంది.

అనంతరం ఆల్‌రౌండర్‌ స్నేహ రాణా గురించి మాట్లాడుతూ.. 7వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇలాంటి ఆల్ రౌండర కోసమే ఇన్నాళ్లు వేచి చూశామంది. స్నేహతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం ఈ మ్యాచ్ లో ఎంతో విలువైందని పేర్కొంది. హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ ఫామ్‌ లో లేకపోవడంపై మాట్లాడుతూ, క్రికెట్ లో ప్రతీ ఒక్కరు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుక్కొంటారని, అలాంటి వారికి అండగా టీం ఉంటుందని వెల్లడించింది. ఇంగ్లండ్ తో రాబోయే టీ20 సిరీస్‌లో బాగా రాణించేందుకు మూడో వన్డే విజయం స్ఫూర్తి నింపుతుందని, టీ20 సిరీస్ గెలిచేందుకు పోరాడతామని తెలిపింది.

Also Read:

Euro Cup 2020: యూరో కప్‌లో డెన్మార్క్‌ సంచలనం.. 29 ఏళ్ల తరువాత మొదటి సారి.!

Smriti Mandhana: స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన స్మృతి మంధాన. ఆ అద్భుత క్యాచ్‌ను మీరూ చూసేయండి.

టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!